Moon : చంద్రునిపై భూమి, ఫ్లాట్ లు కొనుగోలు చేయొచ్చా..? సాధ్యమేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Moon : చంద్రునిపై భూమి, ఫ్లాట్ లు కొనుగోలు చేయొచ్చా..? సాధ్యమేనా?

 Authored By sekhar | The Telugu News | Updated on :28 August 2023,8:00 pm

Moon : ఇటీవల చంద్రాయన్-3 ప్రాజెక్టు సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ ధ్రువం పై మొట్టమొదటిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఇప్పుడు చంద్రుడి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రునిపై భూములు మరియు ఫ్లాట్లు కొంతమంది సెలబ్రిటీలు కొనుక్కున్నట్లు అప్పట్లో వార్తలు రావడం తెలిసిందే. అంతేకాదు భూమి మీద కంటే చంద్రునిపై తక్కువ ధరకు ఫ్లాట్ లు కొనుగోలు చేయవచ్చన్నట్లు ప్రచారం జరిగింది.

అయితే ఇది నిజంగా సాధ్యమేనా? చంద్రునిపై భూమి కొనవచ్చా? వాస్తవ తనిఖీ వెబ్‌సైట్‌లు, రక్షణ, ఏరోస్పేస్ నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మూన్ ల్యాండ్‌ లో భూమి మరియు ఫ్లాట్లు కొనుగోలు అనేది అసాధ్యమని డిఫెన్స్, ఏరోస్పేస్ నిపుణుడు గిరీష్ లింగన్న స్పష్టం చేయడం జరిగింది. చంద్రునితో సహా బాహ్య అంతరిక్షాన్ని ఎవరు కొనుగోలు చేయలేరని.. ఎవరికి దక్కదని పేర్కొన్నారు. అసలు యజమాని లేనప్పుడు భూమిని ఎలా అమ్ముతారు అని క్లారిటీ ఇచ్చారు. 1967లో అమల్లోకి వచ్చిన ఒప్పందం అందరికీ ఉమ్మడి వారసత్వం అని స్పష్టం చేశారు.

is it possible to buy land and flats on the moon

చంద్రునిపై భూమి, ఫ్లాట్ లు కొనుగోలు చేయొచ్చా..? సాధ్యమేనా?

అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో దివంగత సుశాంత్ సింగ్ చంద్రునిపై కొంత స్థలం కొనుగోలు చేసినట్లు దానికి మెర్ ముస్కోవియన్స్ లేదా సీ ఆఫ్ మస్కోవి అని పిలుచుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిలో వాస్తవం లేదని.. చంద్రునిపై కొనే హక్కు ఎవరికీ లేదని దానికి యజమాని లేడని.. అలాంటప్పుడు అమ్మడం కొనడం అసాధ్యం అంటూ డిఫెన్స్, ఏరోస్పేస్ నిపుణుడు గిరీష్ లింగన్న స్పష్టం చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది