Jamili Elections : జమిలి ఎన్నికలు అప్పుడే? ఆలస్యం కానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అప్పటి వరకు ఆగాల్సిందే?
Jamili Elections : ప్రస్తుతం దేశంలో జమిలి ఎన్నికల హడావుడి నడుస్తోంది. అది కూడా పాక్షిక జమిలి ఎన్నికలు. ఇవి ఒకవేళ లేట్ అవుతున్నా కొద్దీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా లేట్ కానున్నాయి. దానికి కారణం.. అయోధ్యలో రామమందిర ప్రారంభం. రామమందిరాన్ని ప్రారంభించకుండా ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదు. దాన్ని ప్రారంభించాక ఎన్నికలకు వెళ్తేనే బీజేపీకి ప్లస్ అవుతుంది. కానీ.. రామమందిరం ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. ఇంకా మూడు నాలుగు నెలలు పడుతుంది. వచ్చే సంవత్సరం జనవరిలో రామ మందిరాన్ని ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ తర్వాతనే జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే.. లోక్ సభను రద్దు చేయాలి. అందుకే ఈనెలలో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును పెట్టి దాన్ని ఆమోదింపజేసుకొని లోక్ సభను రద్దు చేయాలనేది బీజేపీ ప్రభుత్వం ప్లాన్. అంటే.. ఈ పాక్షిక జమిలి ఎన్నికలు డిసెంబర్ లేదా జనవరిలో జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. రామమందిరం ప్రారంభం వల్ల ఇంకాస్త లేట్ అయ్యే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. అవి కూడా ఇంత తక్కువ టైమ్ లో అంటే అది సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు విశ్లేషకులు.నిజానికి ఈ డిసెంబర్ లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందులో తెలంగాణ కూడా ఉంది. కానీ.. జమిలి ఎన్నికలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జమిలి ఎన్నికలతో పాటే తెలంగాణ ఎన్నికలు కూడా జరుగుతాయి.
Jamili Elections : తెలంగాణ ఎన్నికలు లేట్ అవుతాయా?
మొత్తం 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, దేశమంతా పార్లమెంట్ ఎన్నికలు జరిపేందుకు మోదీ సర్కారు పావులు కదుపుతోంది. ఈ సంవత్సరం డిసెంబర్ లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కీం, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. ఈ సంవత్సరం డిసెంబర్ లో జరగబోయే రాష్ట్రాలకు మాత్రం ఎన్నికలు లేట్ అయితే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే.. 2024 జనవరి 16 లోపు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే.. రాష్ట్రపతి పాలన పెట్టాలి. అందుకే.. ఒకవేళ ఎన్నికలు ఆలస్యం అయినా తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టి ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సంసిద్ధం అవుతోంది. చూద్దాం మరి ఇది ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో?