Jamili Elections : జమిలి ఎన్నికల ఖరారు సమయంలో ఈ బిగ్ ట్విస్ట్ ఏంటి ?
ప్రధానాంశాలు:
Jamili Elections : జమిలి ఎన్నికల ఖరారు సమయంలో ఈ బిగ్ ట్విస్ట్ ఏంటి ?
Jamili Elections : కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, జార్ఖండ్ తో పాటుగా ఈ రోజు జరుగుతున్న ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలకు అనుగుణంగా జమిలి నిర్వహణ.. సమయం పైన కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఝార్ఖండ్‌లో తొలి విడతతోపాటు 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ఎన్నికల సంఘం ప్రకటించగా, సిక్కింలోని 2 నియోజకవర్గాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీంతో బుధవారం 31 చోట్ల పోలింగ్ జరుగుతోంది. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి బుధవారమే పోలింగ్ జరుగుతోంది.
Jamili Elections పోటా పోటీ..
జార్ఖండ్ లో రెండు ప్రధాన కూటముల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. జేఎంఎం కూటమిని ఓడించేందుకు బీజేపీ అగ్ర నేతలు రంగంలోకి దిగారు. రెండు దశల్లో ఇక్కడ పోలింగ్ జరగనుంది. రెండు కూటములు ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ మేనిఫెస్టోలను ప్రకటించారు. సిక్కింలోని 2 నియోజకవర్గాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన 31 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది. ప్రియాంక గాంధీ బరిలో నిలిచిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ మొదలైంది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవటం కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎల్డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మొకేరి, బిజెపికి చెందిన నవ్య హరిదాస్‌లపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. బీజేపీ సైతం రెండు రాష్ట్రాలతో పాటుగా ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

Jamili Elections : జమిలి ఎన్నికల ఖరారు సమయంలో ఈ బిగ్ ట్విస్ట్ ఏంటి ?
ఈ ఎన్నికల్లో ఫలితాలకు అనుగుణంగా జమిలి నిర్వహణ.. సమయం పైన కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు జరుగుతున్న పోలింగ్ సరళి పైన ప్రధాన పార్టీలు ఆసక్తితో చూస్తున్నాయి.జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 15,344 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో 14,394 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. నక్సల్స్ ప్రభావితమైన 950 బూత్‌లలో ఉదయం 7గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓటింగ్ నిర్వహిస్తున్నారు.మధ్యప్రదేశ్‌లో జరగుతున్న అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటు హక్కును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వినియోగించుకున్నారు.