కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీతో పెట్టుకుంటే దేశంలో ప్రాంతీయ పార్టీల నాయకుల పరిస్థితి ఏంటో ఇప్పటికే పలు సందర్బాల్లో తెలిసి పోయింది. కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా రాష్ట్రాలను తమ అదుపులో పెట్టుకోవాలని చూస్తుంటాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తుంది అనేది ప్రతి ఒక్కరు అనే మాట. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వంతో పెట్టుకోవడం వల్లే 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూడాల్సి వచ్చింది అనేది ఇక్కడ కొందరు చెబుతున్న మాట. అందుకే చంద్రబాబు నాయుడు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్కరు కూడా మోడీతో పెట్టుకునేందుకు ముందుకు రావడం లేదు. రాజకీయ ఉద్దండుడిగా పేరున్న కేసీఆర్ కూడా మోడీ మరియు షా లతో పెట్టుకునేందుకు వెనుకాడుతున్నాడు.
రాష్ట్రంలో బీజేపీతో టీఆర్‌ఎస్ పార్టీ కయ్యానికి కాలు దువ్వుతోంది. ముఖ్యంగా దుబ్బాక ఎన్నికలు పూర్తి అయినప్పటి నుండి బీజేపీని తొక్కి పెట్టేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు చెబుతున్న మాట. కేసీఆర్ మరియు కేటీఆర్ లు బీజేపీ నాయకులను తీవ్రంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాని మోడీ షాల విషయం వచ్చే వరకు మౌనం గా ఉంటున్నారు. కాస్త మెతకగానే కేంద్ర నాయకత్వం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. మోడీ మరియు అమిత్ షా లను తిడితే ఏం జరుగుతుందో కేసీఆర్ అండ్ టీమ్ కు బాగా తెలుసు. అందుకే అక్కడ నాయకులతో కాస్త స్నేహంగానే ఉంటున్నారు.
మోడీతో పెట్టుకుంటే తన రాజకీయంను గందరగోళంలోకి నెట్టివేయడం ఖాయం అనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నాడు. అందుకే కేసీఆర్ ప్రతి విషయంలో కూడా కేంద్రంకు అనుకూలంగా ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడు. బయటకు చూస్తే మాత్రం బీజేపీతో ఢీ కొట్టినట్లుగా అనిపిస్తుంది. వారికి రాజ్యసభలో సాయం అవసరం అయినప్పుడు సైలెంట్ గా మద్దతు తెలపడం చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ రాజకీయ చతురతతో ప్రవర్తిస్తూ తనకు చంద్రబాబు నాయుడు కు పట్టిన గతి పట్టకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా మోడీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతో కేసీఆర్ వారికి కాస్త స్నేహ హస్తం ఇస్తున్నట్లుగా రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.