Lok Sabha Election Result 2024 : లేటెస్ట్ ట్రెండ్.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ లీడ్‌లో ఉందంటే..?
ప్రధానాంశాలు:
Lok Sabha Election Result 2024 : లేటెస్ట్ ట్రెండ్.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ లీడ్‌లో ఉందంటే..?
Lok Sabha Election Result 2024 : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం చాటుకుంది. ఎన్డీఏ 294 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇండియా కూటమి 230, ఇతరులు 19 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
Lok Sabha Election Result 2024 యూపీలో తారుమారు ..
యూపీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో 60కి పైగా స్థానాల్లో గెలుపొందాలని ఆపార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.. అయితే.. అక్కడ బీజేపీకి సమాజ్ వాది పార్టీ గట్టిపోటీనిస్తోంది. మొత్తం 80 స్థానాల్లో.. తాజా ట్రెండ్స్ ను పరిగణనలోకి తీసుకుంటే 39 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. ఎస్పీ 30, కాంగ్రెస్ 7, ఆర్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Lok Sabha Election Result 2024 మహారాష్ట్ర మహావికాస్ అఘాడీ పైచేయి
మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి పైచేయి సాధించింది. మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో NDA 20 స్థానాల్లో, ఇండియా కూటమి 27 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎంఐఎం ఒకస్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Lok Sabha Election Result 2024 కర్ణాటకలో కమలం జోరు..
కర్ణాటకలో బీజేపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 17 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. బీజేపీ భాగస్వామ్యపక్షమైన జేడీఎస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Lok Sabha Election Result 2024 ఢిల్లీలో బీజేపీనే..
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ పైచేయి సాధించింది. మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో 6 నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది.
బిహార్ లో..
బీహార్‌లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. జేడీయూ 15 స్థానాలు, బీజేపీ 12, ఎల్జేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆర్జేడీ 3 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
బెంగాల్ లో టీఎంసీ..
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం 42 స్థానాల్లో టీఎంసీ 29 స్థానాల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
గుజరాత్ క్లీన్ స్వీప్ దిశగా..
గుజరాత్‌లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 26 స్థానాల్లో బీజేపీ 25, కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
ఏపీలో ఎన్డీఏ..
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ఎన్డీయే కూటమిలోని టీడీపీ 14, బీజేపీ 4, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
తెలంగాణలో హోరాహోరీ..
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ నెలకొంది. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 7 స్థానాలు, ఎంఐఎం 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.
మధ్యప్రదేశ్ లో..
మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 25 స్థానాల్లో అన్ని స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
కేరళలో హస్తం హవా..
కేరళలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం 20 స్థానాల్లో కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తోంది. ఐయూఎంఎల్ 2, బీజేపీ 2, సీపీఎం 1, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పంజాబ్‌లో..
పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. కాంగ్రెస్ 6 స్థానాలు, ఆప్ 3 స్థానాలు, శిరోమణి అకాలీదళ్ 2 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ లో కమల వికాసం..
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ జోరు కొనసాగుతోంది. మొత్తం 11 స్థానాల్లో బీజేపీ 10 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.