Lottery Ticket : అదృష్టం అంటే వీళ్లదే.. డబ్బుల్లేక చిల్లరంతా పోగేసి కొన్న రూ.250 లాటరీతో.. 10 కోట్ల జాక్ పాట్ కొట్టేసారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lottery Ticket : అదృష్టం అంటే వీళ్లదే.. డబ్బుల్లేక చిల్లరంతా పోగేసి కొన్న రూ.250 లాటరీతో.. 10 కోట్ల జాక్ పాట్ కొట్టేసారు..!

 Authored By aruna | The Telugu News | Updated on :28 July 2023,8:10 pm

Lottery Ticket : అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. అది ఈ మహిళల విషయంలో జరిగింది. కనీసం ఒక్కొక్కరి చేతిలో 25 రూపాయలు లేని పదకొండు మంది మహిళలు తమ దగ్గర ఉన్న చిల్లరంతా పోగు చేసి రూ.250 తో లాటరీ టికెట్ కొన్నారు. అదృష్టం కలిసి రావడంతో వీరు కొన్న టికెట్ కే లాటరీ తగిలింది. ఏకంగా వీళ్లు 10 కోట్ల జాక్పాట్ కొట్టేశారు. ఈ ఘటన కేరళలో జరిగింది. అక్కడ మున్సిపాలిటీ లో పనిచేసే సభ్యులు భూమిలో కలిసిపోని వ్యర్ధాలను ఇల్లు, ఆఫీసుల నుంచి సేకరించి రీసైక్లింగ్ కోసం ఈ యూనిట్లకి పంపిస్తారు. ఇందులో పనిచేస్తున్న 11మంది మహిళలు కొద్ది వారాల క్రితం లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు.

ఆ లాటరీ టికెట్ 250 రూపాయలుగా ఉంది. అయితే మహిళలు ఎవరి దగ్గర అంత మొత్తం డబ్బు లేదు. దీంతో తమ దగ్గర ఉన్న చిల్లరంతా పోగు చేశారు. ఓ మహిళ అయితే ఆ చిల్లర కూడా లేక వేరే వారిని బదులు తీసుకొని ఇచ్చింది. అలా 11మంది 250 జమ చేసి లాటరీ టికెట్ కొన్నారు. కేరళ లాటరీ డిపార్ట్మెంట్ గత బుధవారం డ్రా తీయగా ఈ మహిళలు కొన్న టికెట్ కి జాక్పాట్ తగిలింది. ఈ లాటరీ ప్రైజ్ మనీ 10 కోట్లు కావడంతో మహిళల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారు మాట్లాడుతూ మేము అంతకుముందు చాలాసార్లు లాటరీ టికెట్ కొన్నాం. కానీ ఈసారి మేమంత డబ్బులు పోగుచేసుకొని టికెట్ కు లాటరీ తగిలింది.

Lottery ticket hit 10 cr jackpot

Lottery ticket hit 10 cr jackpot

మాకు జాక్పాట్ తగలడం చాలా సంతోషంగా ఉంది. మేమంతా కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నాం. నాకు వచ్చే జీతం డబ్బుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాం. ఆడపిల్లల పెళ్లిళ్లు, అప్పులు, చికిత్సలు ఇలా ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్నింటిని ఈ డబ్బుతో తీరుస్తాం అని ఆ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీళ్ళు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఇలాంటి పేద కుటుంబాలకు జాక్ పాట్ తగిలినందుకు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు దేనికైనా కొంచెం అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఈ 11 మంది మహిళలకు వరించింది అని కామెంట్స్ చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది