Modi : జగన్ ను టార్గెట్ చేస్తున్న మోడీ.. ఎందుకీ మార్పు..?
Modi : ప్రధాని నరేంద్ర మోడీకి, జగన్ కు ఇప్పటి వరకు పెద్దగా పొరపొచ్చాలు లేవు. ఇప్పటి వరకు జగన్ మోడీని ఏమీ అనలేదు. అటు మోడీ కూడా ఎన్నడూ వైసీపీ ప్రభుత్వాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు టీడీపీతో ఏపీలోకూటమిగా ఏర్పడ్డ బీజేపీ ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఇక మోడీ అయితే స్వయంగా జగన్ మీద ఫైర్ అవుతున్నారు. జూన్ 4వ తేదీ జగన్ ప్రభుత్వానికి ఆఖరు రోజు అని తేల్చేస్తున్నారు. జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని.. వారు మార్పు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. దాంతో ఇప్పుడు అందరి దృష్టి మోడీపై పడింది.
మోడీ ఇంతకు ముందు కూడా ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. కానీ ఇంతలా ఒక ప్రభుత్వానికి డెడ్ లైన్ అయితే అస్సలు పెట్టలేదు. మొన్న చిలకలూరిపేటకు వచ్చినప్పుడు కూడా జగన్ పేరెత్తలేదు. కానీ 6, 7వ తేదీన మాత్రం ఏపీలో జగన్ మీద విమర్శలు గుప్పించారు. వైసీపీకి కాంగ్రెస్ లక్షణాలు ఉన్నాయన్నారు. అందుకే వారు ఏపీలో కుటిలత్వాన్ని, నిరంకుశత్వాన్ని, అవినీతిని పెంచి పోషిస్తున్నారంటూ విమర్శించారు మోడీ. అయితే జగన్ మీద ఇంతగా కామెంట్లు చేయడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు.ఆమె నిత్యం మోడీని టార్గెట్ చేస్తున్నారు. ఆమె విభజన హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అంతే కాకుండా స్టీల్ ప్లాంట్ గురించి, ప్రత్యేక హోదా గురించి నిత్యం నిలదీస్తున్నారు.
Modi : జగన్ ను టార్గెట్ చేస్తున్న మోడీ.. ఎందుకీ మార్పు..?
దాంతో షర్మిల విమర్శలు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. అందుకే మోడీ వచ్చి షర్మిల, జగన్ ఒక్కటే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో పాటు జగన్ విశ్వసనీయతపై కూడా మోడీకి అనుమానం ఉంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోతే జగన్ ఇండియా కూటమికి మద్దతిస్తాడేమో అని మోడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.మోడీ తనకు అనుకూలంగా లేకపోతే ఎవరినైనా టార్గెట్ చేస్తుంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు జగన్ ను ఇంతగా టార్గెట్ చేయడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడు మోడీకి, జగన్ కు గ్యాప్ వచ్చేసింది.
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
This website uses cookies.