Ys Sharmila : షర్మిలకు ఒకేరోజు మూడు షాకులు.. ఇలా జరిగిందేంటి..?
Ys Sharmila : ఏపీ రాజకీయాలు ఇప్పుడు మహా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంత పోటీ వాతావరణం ఈ సారి కనిపిస్తోంది. అటు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటములుగా ఏర్పడ్డాయి. దాంతో పాటు కాంగ్రెస్ కూడా వామపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడింది. కానీ వైసీపీ మాత్రం సింగిల్ గానే వస్తోంది. ఇక జగన్ మీదనే ఆయన సొంత చెల్లెలు షర్మిల బాణం ఎక్కు పెడుతోంది. జగన్ పై ఎన్నో ఆరోపణలు చేస్తోంది. వరుసగా ప్రచారాలు చేస్తోంది. పంచ్ డైలాగులతో దూసుకుపోతున్న షర్మిలకు తాజాగా ఒకేరోజు మూడు షాక్ లు తగిలాయి.
ప్రస్తుతం ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తాజాగా మంగళవారం నాడు ప్రచారం నిర్వహించారు. అయితే ఆమెను ప్రచారం చేస్తున్న సమయంలో ఆమె వాహనాన్ని అప్పులోళ్లు అడ్డుకున్నారు. తమ వాహనాలకు చెల్లించాల్సిన అద్దె రూ.6 లక్షలు ఇవ్వాలంటూ గొడవ పడ్డారు. అయితే వారికి ఏదో సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె ప్రచారాన్ని బెనీటమైన్స్ బాధితులు అడ్డుకున్నారు. అయితే తనకు బెనీటమైన్స్ తో సంబంధం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది షర్మిల. అయితే ఆమె వారికి సరైన సమాధానం చెప్పుకుండానే వెళ్లిపోయింది.
Ys Sharmila : షర్మిలకు ఒకేరోజు మూడు షాకులు.. ఇలా జరిగిందేంటి..?
ఇక ఆమెకు, ఆమె సోదరి సునీతకు కోర్టులో మరో షాక్ తగిలింది. ప్రచారంలో వైఎస్ వివేకానంద హత్య గురించి మాట్లాడొద్దంటూ ఇప్పటికే కడప కోర్టు ఆర్డర్ వేసింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ అటు హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఈ కేసును కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ హై కోర్టు ఆర్డర్ వేసింది. దాంతో వారిద్దరూ మరోసారి కడప కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై మరోసారి విచారణ జరిపిన కోర్టు వారిద్దరికీ మరో షాక్ ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరికీ రూ.10వేల ఫైన్ విధించింది కోర్టు. ఆ జరిమానాను కడప జిల్లా లీగల్ సెల్ కు కట్టాలంటూ ఆదేశించింది. ఇలా ఒకేరోజు ఇలా వరుస షాకులు తగలడం షర్మిలకే మొదటిసారి కావచ్చేమో.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.