Ajith Pawar : బాబాయ్ కి అబ్బాయ్ వెన్నుపోటు పొడవడం వెనక జరిగింది ఇదే – దీ తెలుగు న్యూస్ విశ్లేషణ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ajith Pawar : బాబాయ్ కి అబ్బాయ్ వెన్నుపోటు పొడవడం వెనక జరిగింది ఇదే – దీ తెలుగు న్యూస్ విశ్లేషణ !

 Authored By kranthi | The Telugu News | Updated on :4 July 2023,10:00 am

Ajith Pawar : 2019 ఎన్నికలు జరగడానికి ముందు.. మహారాష్ట్రలో పరిస్థితులు వేరేగా ఉండేవి. ఆ తర్వాత వేరేగా మారాయి. 2019 ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి విజయం సాధిస్తుందని అంతా భావించారు. అలాగే.. ఎన్నికల్లో రెండు పార్టీలకు మంచిగానే సీట్లు వచ్చాయి కానీ.. అధికారం పంపకంలో రెండు పార్టీల మధ్య చెడింది. ముఖ్యమంత్రి, మంత్రుల పదవుల విషయంలో రెండు పార్టీలకు చెడటంతో రెండు పార్టీలు దూరం అయ్యాయి. కానీ.. శివసేన పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. అది ఎలా సాధ్యం అయింది అంటే.. ఎన్సీపీని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకుంది.

కానీ.. ఇక్కడ ఎన్సీపీలో ముఖ్య నేత అజిత్ పవార్ వేసే ఎత్తుగడలను ఎవ్వరూ ఊహించలేకపోయారు. శరద్ పవార్ కు ఆయన చాలా సార్లు, షాక్ లు ఇస్తూ వచ్చారు. శివసేన కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అజిత్ పవార్. కానీ.. ఆ తర్వాత మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో అజిత్ పవార్ పదవీచ్యుతుడయ్యాడు.పదవి లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వంలోకి మళ్లీ చేరిపోయాడు. ప్రస్తుతం ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వేరే కుంపటి పెట్టారు. బీజేపీతో సై అన్నారు. నిజానికి శరద్ పవార్ ఇప్పటికే రాజకీయాలకు బై చెప్పారు.

ncp chief sharad pawar and ajith pawor

ncp chief sharad pawar and ajith pawor

Babai – Abbai : మళ్లీ బీజేపీ చెంతకు చేరిన అజిత్ పవార్

దీంతో అజిత్ పవార్ కు స్వేచ్ఛ వచ్చి బీజేపీతో సై అన్నాడు. ఇప్పుడు బీజేపీ కూటమికి జై కొట్టాడు. మళ్లీ ఉపముఖ్యమంత్రి పదవి పొందాడు. అయితే.. ఎన్సీపీ మొత్తం బీజేపీకి మద్దతు ఇస్తోందని అజిత్ పవార్ ప్రకటించినా.. ఆయన అధికారం, పదవి కోసమే ఏక్ నాథ్ షిండే గ్రూప్ తో జత కట్టారని మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. చూద్దాం.. ఎన్నికల లోపు మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది