Old Woman : 70 ఏళ్లకు తల్లి అయింది.. వృద్ధ మహిళ సరికొత్త రికార్డు
70 ఏళ్ల వయసులో ఓ మహిళ చరిత్ర సృష్టించింది. ఆ వయసులో కృష్ణా రామా అంటూ లేనిపోని వ్యాధులతో బాధపడుతూ కూర్చోలేదు ఆ మహిళ. తన చిరకాల కోరికను, తన వాంఛను నెరవేర్చుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ ఘటన గుజరాత్ లోని మోరాలో చోటు చేసుకుంది.

old woman gives birth to baby girl in gujarat
మోరాకు చెందిన రబరి, బల్ధారి అనే దంపతులకు పిల్లలు లేరు. పిల్లల కోసం వాళ్లు చేయని పని లేదు. తిరగని గుడి లేదు. కానీ.. పిల్లలు కలగలేదు. కానీ.. పెళ్లయిన 45 ఏళ్ల తర్వాత తాజాగా బల్ధారి బిడ్డకు జన్మనిచ్చింది.
Old Woman : ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ
ఐవీఎఫ్ పద్ధతిలో బల్ధారి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి కావాలని నాలుగు దశాబ్దాల నుంచి కలలు కన్న ఆ వృద్ధ మహిళ కోరిక చివరకు నెరవేరింది. తన కోరిక 70 ఏళ్ల వయసులో తీరింది. తను ఆ వయసులో బిడ్డకు జన్మినిచ్చి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసులో తల్లి అయిన అతికొద్ది మంది జాబితాలో చేరింది.
మాకు ఈ జన్మలో పిల్లలు పుడతారని అనుకోలేదు. పిల్లల మీద ఆశ కూడా వదిలేసుకున్నాం. కానీ.. మాకు పిల్లలను ఈ వయసులో ఇచ్చాడు దేవుడు. ఇప్పటికైనా ఆ దేవుడు మమ్మల్ని కరుణించాడు.. అని చెప్పి ఆ మహిళ సంతోషం వ్యక్తం చేసింది.