Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అహంకారం చూసి మోడీకి కోపం వచ్చిందా?
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఫుల్ యాక్టివ్ లో ఉన్న పార్టీ అంటే జనసేన అనే చెప్పుకోవాలి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా అంత యాక్టివ్ గా లేదు కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మామూలుగా కాదు.. ఓ రేంజ్ లో ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, బీజేపీతో పొత్తులో ఉంది. కానీ.. ఆ పొత్తు పేరుకే కానీ.. నిజంగా అసలు అక్కడ పొత్తు ఉందా లేదా అంటే చెప్పడం కష్టం. ఆ పొత్తు ఎన్నికల వరకు ఉంటుందా అనేది చెప్పడం కూడా కష్టమే.
ఎందుకంటే.. ఇప్పటి వరకు బీజేపీతో కలిసి ఏ కార్యక్రమంలోనూ పవన్ కళ్యాణ్ పాల్గొన్నది లేదు. పేరుకే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నట్టుగా ఏపీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ.. జనసేన పార్టీ.. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతోంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయాలని భావిస్తోంది. టీడీపీ కూడా జనసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా దూకుడు మీదున్నారు. బీజేపీతో ఎలాగూ పొత్తులో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఏపీలో రాజకీయ పొత్తు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన రెండు పార్టీలు టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్.. ఎందుకు ఢిల్లీలో ఏకపక్షంగా ప్రకటన చేశారు అనేది బీజేపీ నేతల ప్రశ్న. ఎందుకంటే.. ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య ఇంకా పొత్తుపై స్పష్టత రాలేదు. బీజేపీ కూడా టీడీపీతో పొత్తు విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. 2019 ఎన్నికల ముందే బీజేపీతో..
Pawan Kalyan : ఏకపక్షంగా పవన్ ఎందుకు ప్రకటన చేసినట్టు?
టీడీపీ తెగదెంపులు చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ.. టీడీపీతో దూరంగా ఉంటూ వచ్చింది. ఆ మధ్య ఢిల్లీకి వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఢిల్లీకి కూడా వెళ్లారు. కానీ.. బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన రాలేదు. కానీ.. టీడీపీని, బీజేపీతో పొత్తు పెట్టించడం కోసం మధ్యవర్తిగా పవన్ కళ్యాణ్ నడుచుకోవడం, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పే ప్రయత్నం చేయడం బీజేపీకి లేనిపోని చిక్కులు తీసుకొస్తోంది. చూద్దాం మరి ఈ పొత్తుల అంశం ఇంకెంత దూరం పోతుందో?