Good News : రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం .. ఏకంగా ఖాతాలోకి 3 లక్షలు…!
Good News : కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు శుభవార్త అందించింది. త్వరలోనే రైతులకు లోన్లు అందించేందుకు ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించింది. ఈ పోర్టల్ పేరు పిఎం కిసాన్ రిన్ పోర్టల్. దీనిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. ఇప్పటివరకు ఎక్కడ లేని విధంగా డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా రైతన్నలకు రుణాలు అందించబోతున్నారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండటానికి ఈ ఫెసిలిటీని కల్పించినట్లు తెలుస్తోంది. ఈ పోర్టల్ లో రైతుల పూర్తి వివరాలు, వడ్డీ రాయితీ, రుణాల మంజూరు చేసుకోవడం లాంటివి ఉంటాయట.
ఈ పోర్టల్ లో మొత్తం 97 కమర్షియల్ బ్యాంకులు, 58 రీజనల్ బ్యాంకులు, 512 కో ఆపరేటివ్ బ్యాంకులు రైతన్నలకు రుణాలు అందిస్తాయట. ఈ పోర్టల్ పై పూర్తి వివరాల కోసం రైతన్నలు https:// fasalrin. gov. in/ వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కేంద్ర ప్రభుత్వం 6,573.5 కోట్లు రుణాలను సబ్సిడీ వడ్డీ రేటుకి రైతులకు మంజూరు చేశామని కేంద్ర మంత్రులు తెలియజేశారు. అయితే ఈ పథకం ద్వారా ప్రతి రైతు 3 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు అని కేంద్రం తెలిపింది. రుణాలు అవసరం ఉన్న రైతులు పైన ఉన్న పోర్టల్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు.
నరేంద్ర మోడీ సర్కార్ ఆల్రెడీ రైతన్నలకు పీఎం కిసాన్ పథకం కింద 2000 చొప్పున నాలుగు విడతలుగా 8 వేలుగా రైతుల ఖాతాలోకి వేస్తున్నారు. మరోసారి రైతన్నలకు పిఎం కిసాన్ రిన్ పోర్టల్ పథకం ద్వారా ఏకంగా మూడు లక్షల వరకు రుణాలను అందిస్తుంది. దీంతో రైతులు కేంద్ర ప్రభుత్వంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ వడ్డీ రేటుకు రైతులకు మంజూరు చేసామని కేంద్ర మంత్రులు తెలియజేశారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు 3 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు అని కేంద్రం తెలిపింది.