PM Modi : మోడీ క్లీయర్‌గా చెప్పేశాడు, ఇంకా అక్కడే ఉండి టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకన్నా?
PM Modi : దేశంలో ఎంతో కాలంగా వస్తున్న పాత చింతకాయ పచ్చడి వంటి పద్దతులను చట్టాలను తొలగించాల్సిన సమయం వచ్చింది. ఇంకా ఆ చట్టాలనే పట్టుకుని కూర్చేంటే పనులు కావు. అభివృద్ది అనేది మనకు ఇంకా చాలా దూరంలోనే ఉండి పోతుంది. కొన్ని నిర్ణయాలు అందరికి నచ్చాలని లేదు. ఆ నిర్ణయాల ఫలితాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరికి నచ్చుతాయి అనేది ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం. ప్రతి ఒక్కరు కొత్త నిర్ణయాలను స్వాగతించాల్సిందే. ఎప్పుడు ఒకే పద్దతిలో ఉంటామంటే ఎలా కుదురుతుంది అంటూ దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. మోడీ ఏ సందర్బంలో ఈ వ్యాఖ్యలు చేశారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
PM Modi : రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి..
దేశంను ఇతర అభివృద్ది చెందుతున్న దేశాల సరసన నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలు కొన్ని పెద్ద నిర్ణయాలను ప్రతి ఒక్కరు సమర్థించాల్సిందే. అలా కాదని అడ్డుకునే ప్రయత్నం చేస్తే దేశ అభివృద్దిని అడ్డుకున్నట్లే అని మోడీ తీసుకు వచ్చిన రైతు చట్టాలకు ఇప్పటికి అయినా మద్దతు తెలిపి ఆందోళనలు ఉపసంహరించుకోవాలంటూ ఈ సందర్బంగా బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు. ప్రధాని తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వారు రైతులకు ఈ విధంగా విజ్ఞప్తులు చేస్తున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే వారి డిమాండ్ లు కొన్నింటిని పరిశీలించి ఒప్పుకున్నాం. అయినా కూడా ఇంకా తగ్గకుంటే ఎలా అంటూ కేంద్ర పెద్దలు అంటున్నారు.
మోడీ చెబుతున్నది ఆలోచించాల్సిన విషయం…
దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్న సమయంలో కొంత ఇబ్బంది అనేది తప్పదు. నోట్ల రద్దు సమయంలో చాలా ఇబ్బంది అయింది. కాని దాని వల్ల మంచి ప్రయోజనం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. నగదు రహిత లావాదేవీలు ఎక్కువ అవ్వడంతో పాటు పెద్ద నోట్లు ఎక్కువగా లేని కారణంగా అవినీతి తగ్గిందని అంటున్నారు. మొత్తానికి మోడీ నిర్ణయం దీర్ఘ కాలికంగా ప్రయోజనంగా ఉంటుంది. ప్రజల వ్యక్తిగత అవసరాల గురించి చూడకుండా దేశ ప్రగతిని ప్రధాని చూస్తున్నారు. అందుకే ఆయన చెప్పిన మాటలను కాస్త ఆలకించడంలో తప్పేం లేదు అన్నట్లుగా బీజేపీ నాయకులు సోషల్ మీడియా ద్వారా ప్రధాని వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు.
PM Modi is very clear about new farmer bill