Priyanka Gandhi : breaking : భారతదేశ ప్రధాని అభ్యర్ధిగా ప్రియాంకా గాంధీ?
Priyanka Gandhi : టైటిల్ చదవగానే నమ్మకం కలగడం లేదా? అవును.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ కాదు.. ప్రియాంకా గాంధీ. నిజానికి.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పుంజుకుంటోంది. ఇటీవల కర్ణాటకలో గెలిచి తన సత్తా చాటింది. అధికార పార్టీ బీజేపీకి షాకుల మీద షాకులు ఇస్తోంది. అలాగే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఓడించడానికి బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ సారి బీజేపీ వర్సెస్ ఇతర కూటములు అన్నట్టుగా పోటీ ఉండనుంది.
ఇప్పటికే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి రెండో సారి కూడా ప్రధాన మంత్రి అయ్యారు నరేంద్ర మోదీ. మూడో సారి కూడా బీజేపీ నుంచి ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో కాదు.. మళ్లీ మోదీనే. బీజేపీ కూడా ఆ విషయాన్ని కన్ఫమ్ చేసింది. అందుకే.. వేరే పార్టీల నేతలు ఎవరైనా సరే.. వేరే పార్టీల ప్రధాన మంత్రి అభ్యర్థులు ఎవరైనా సరే.. ప్రధాని మోదీతో పోటీ పడాలి.విపక్ష కూటమి అంతా కలిసి మోదీ మీద దండయాత్ర చేస్తా అంటున్నారు అంతా బాగానే ఉంది కానీ.. అసలు విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. విపక్ష పార్టీలు అన్ని కలిసినా.. ప్రధాని అభ్యర్థి పవర్ ఫుల్ అయితేనే మోదీని ఢీకొట్టగలరు.
Priyanka Gandhi : విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు?
రాహుల్ గాంధీ రెండు సార్లు మోదీతో పోటీ పడ్డారు. కానీ గెలవలేకపోయారు. దేశవ్యాప్త ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితేనే విపక్ష కూటమి తరుపున పోటీ చేయగలరు. నితీష్ కుమార్, అరవింద్ కేజ్రివాల్ లాంటి వాళ్లు కొన్ని ప్రాంతాలకే పరిమితం. అందుకే.. ప్రియాంక గాంధీ అయితేనే దేశవ్యాప్తంగా తనకు ఇమేజ్ ఉంది. అందుకే.. విపక్ష పార్టీల ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రియాంకా గాంధీని నిలబెట్టాలని భావిస్తున్నారట. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో ప్రియాంకా గాంధీ పాత్ర కూడా ఉంది. అలాగే.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పోలికలతో ఉన్న ప్రియాంకా గాంధీ అయితే కరెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో?