YS Sharmila – Priyanka Gandhi : వైఎస్ షర్మిలతో ప్రియాంకా గాంధీ ప్లానింగ్.. ఇది వర్క్ అవుతుందా?
YS Sharmila – Priyanka Gandhi : ఓహో.. కర్ణాటకలో గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ మామూలు దూకుడు మీద లేదు. అవును.. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలను ఓడించాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ను ఓడించేందుకు ఏకంగా ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
నిజానికి.. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టి రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే.. తెలంగాణ రాజకీయాల విషయంతో వైఎస్ షర్మిలతో ప్రియాంకా గాంధీ సంప్రదింపులు చేశారట. ప్రియాంక గాంధీ.. వైఎస్ షర్మిలకు ఫోన్ చేశారట. ఇద్దరూ కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారట. ఏపీ, తెలంగాణలో వైఎస్ షర్మిల ద్వారా తమ ప్లాన్ ను అమలు చేయాలని ప్రియాంకా గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
YS Sharmila – Priyanka Gandhi : డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం చేస్తున్నారట
ప్రియాంకా గాంధీ, షర్మిల మధ్య డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. డీకే శివకుమార్ కు, షర్మిల కుటుంబానికి చాలా సాన్నిహిత్యం ఉంది. అందుకే.. డీకే శివకుమార్ ద్వారా ప్రియాంకా గాంధీ.. షర్మిలలతో మాట్లాడారట. ఈ వ్యవహారాన్ని శివకుమారే దగ్గరుండి చూసుకుంటున్నారట. షర్మిలను కాంగ్రెస్ వైపు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. షర్మిలకు కాంగ్రెస్ లో విలీనం చేస్తే అటు తెలంగాణ, ఇటు ఏపీ రెండు రాష్ట్రాల్లో తమకు ప్రయోజనం ఉంటుందని ప్రియాంకా గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.