Rahul Gandhi : రాహుల్ గాంధీ ఈజ్ బ్యాక్.. ఇక లోక్ సభలో రచ్చ రచ్చే.. కాంగ్రెస్ లో ఊపు
Rahul Gandhi : ఇది నైతికంగా కాంగ్రెస్ విజయం.. బీజేపీ ఓటమి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ పునరుద్ధరించింది. రాహుల్ గాంధీ ఎంపీ పదవిని అనర్హత వేటుగా లోక్ సభ కార్యాలయం ప్రకటించిన విషయం తెలిసిందే. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేయడంతో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కానీ.. సుప్రీంలో ఆయన సభ్యత్వానికి సంబంధించి అనుకూలమైన తీర్పు వచ్చింది.
దీంతో రాహుల్ గాంధీకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. రాహుల్ గాంధీ ఈజ్ బ్యాక్ అంటూ కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. గుజరాత్ లోని సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.రాహుల్ గాంధీపై లోక్ సభ కార్యాలయం అనర్హత వేటు వేయడంతో వెంటనే రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని కోరారు. ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం న్యాయస్థానం ఆయన జైలు శిక్షపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Rahul Gandhi : సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
అసలు ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించకుండా గరిష్టంగా ఎలా శిక్ష విధించిందంటూ మండిపడింది. ఆయన జైలు శిక్షపై స్టే విధించడంతో లోక్ సభ సభ్యత్వాన్ని కూడా పార్లమెంట్ పునరుద్ధరించడంతో రాహుల్ ఈజ్ బ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.