RBI : గోల్డ్ లోన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

RBI : గోల్డ్ లోన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త…!

RBI  : ప్రస్తుత కాలంలో బంగారానికి డిమాండ్ మరింతగా పెరుగుతూ వస్తుంది. అయితే వాస్తవానికి బంగారం అనేది కేవలం అలంకార వస్తువు మాత్రమే కాదు కష్ట సమయాల్లో ఆదుకునే వస్తువు అని కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామంది బంగారాన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు బ్యాంకులలో ఉంచి లేదా ఆర్థిక సంస్థల నుండి పర్సనల్ లోన్ పొందగలుగుతున్నారు. ప్రస్తుతం చాలామంది ఇలాంటి రుణాలను పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి రుణాలు పొందే వారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  RBI : గోల్డ్ లోన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త...!

RBI  : ప్రస్తుత కాలంలో బంగారానికి డిమాండ్ మరింతగా పెరుగుతూ వస్తుంది. అయితే వాస్తవానికి బంగారం అనేది కేవలం అలంకార వస్తువు మాత్రమే కాదు కష్ట సమయాల్లో ఆదుకునే వస్తువు అని కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామంది బంగారాన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు బ్యాంకులలో ఉంచి లేదా ఆర్థిక సంస్థల నుండి పర్సనల్ లోన్ పొందగలుగుతున్నారు. ప్రస్తుతం చాలామంది ఇలాంటి రుణాలను పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి రుణాలు పొందే వారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది.

RBI  : బంగారంపై రుణాలు పొందుతున్న ఖాతాదారులకు శుభవార్త….

అయితే ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పుడు కష్ట కాలంలో బంగారాన్ని బ్యాంకులో పెట్టి రుణాలు పొందుతున్న ఖాతాదారులకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. ఇక నుండి కస్టమర్లు బ్యాంకులో పెట్టిన బంగారం పై ఎలాంటి గ్యారెంటీ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదట. మరిముఖ్యంగా ఈ నిబంధనలు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులలో అమలు చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు బంగారం పై కేవలం రెండు రక్షల రూపాయల వరకు మాత్రమే రుణాలను పొందారు కానీ ఇప్పటినుండి ఆ పరిమితిని 2 లక్షల నుండి 4 లక్షల పెంచినట్లుగా తెలుస్తుంది. కావున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిబంధనలు కష్టకాలంలో బంగారాన్ని బ్యాంకులలో పెడుతున్న ఖాతాదారులకు ఎంతగానో సహాయపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

RBI గోల్డ్ లోన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త

RBI : గోల్డ్ లోన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త…!

అదేవిధంగా లోన్ రీపేమెంట్ స్కీమ్ కింద తీసుకున్న బంగారం రుణంపై అసలు చెల్లించకుండా వడ్డీని చెల్లించే విధంగా నిర్ణయించారు. కావున ఇప్పటినుండి ఈ EMI చెల్లించాల్సిన అవసరం లేదు. కాని ఈ రుణం వడ్డీ రూపంలో మాత్రమే చెల్లించబడుతుంది. కావున బంగారంపై రుణాన్ని తీసుకున్నవారు తిరిగి చెల్లించటానికి పట్టే సమయాన్ని లెక్కించుకోండి. అదేవిధంగా ప్రతినెలా ఎంత డబ్బును చెల్లించాలో కూడా లెక్కించండి. అత్యవసర పరిస్థితులలో గోల్డ్ లోన్ తీసుకున్న వారు బంగారం కోసం ఎంత మొత్తంలో రుణం తీసుకున్నా రో , వడ్డీతో సహా క్రమం తప్పకుండా చెల్లించండి. కావున ఇప్పుడు గోల్డ్ లోన్ పొందిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకులో బంగారు రుణాలపై కొత్త నిబంధన అమలు చేశాయి కాబట్టి ఇది నిజంగా ఖాతాదారులకు బంగారం పై రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది