Mahatma Gandhi : మహాత్మా గాంధీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్ ఇవే
Mahatma Gandhi : ఈరోజు ఏంటి.. అక్టోబర్ 2.. అక్టోబర్ 2 అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి గాంధీ జయంతి. అవును.. నేడు జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజు. ఆయన గుజరాత్ లోని పోరుబందరులో జన్మించిన విషయం తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నాయకుల్లో మహాత్మా గాంధీ కీలక వ్యక్తి. అందుకే ఆయన్ను ఇప్పటికీ మనం స్మరించుకుంటున్నాం. మన కరెన్సీ నోట్ల మీద ఆయన బొమ్మ వేస్తున్నాం. ఆయన జయంతి, వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన జయంతి, వర్థంతిని ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ఆయన దేశం కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసిన గొప్ప నేతల. ఒక ఉప్పు సత్యాగ్రహం కావచ్చు.. నిరాహార దీక్షలు కావచ్చు.. శాంతియుతంగా మనం పోరాటం చేస్తేనే మనకు స్వాతంత్ర్యం లభిస్తుందని నమ్మిన గొప్ప నేత ఆయన.
మహాత్మా గాంధీ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. చనిపోయే వరకు కూడా ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన కొన్నేళ్ల పాటు కేవలం పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ మాత్రమే తినేవారు. అందుకే ఆయన అనారోగ్యానికి ఎక్కువగా గురికాలేదు. గాంధీ స్వాతంత్ర్య ఉద్యమానికి ముందే మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. ఆయన నీలిమందు రైతుల కోసం పోరాట చేశారు. అప్పుడే ఆయన్ను మహాత్మా అంటూ ముద్దుగా పిలుచుకునేవారు. గాంధీజీ ఎక్కువగా మేకపాలు తాగేవారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి మేకపాలను గాంధీజీ తీసుకొని వెళ్లేవారు. గాంధీకి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి అయింది. ఆయన భార్య పేరు కస్తూర్బా గాంధీ. వీళ్లిద్దరూ 62 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. కానీ.. గాంధీ కంటే ఆయన భార్య ఒక సంవత్సరం పెద్ద.
Mahatma Gandhi : 1948 జనవరి 30న గాంధీపై గాడ్సే కాల్పులు
1948, జనవరి 30న గాంధీని అమితంగా ప్రేమించే గాడ్సే గాంధీపై కాల్పులు జరపడంతో గాంధీజీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాంధీ అంత్యక్రియలకు 20 లక్షల మంది జనం హాజరయ్యారు. ఒక వ్యక్తి మరణిస్తే అంత జనం హాజరుకావడం ఒక రికార్డు. ఇప్పటి వరకు ఏ వ్యక్తి చనిపోయినా అంత జనం హాజరుకాలేదు. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చాక చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు.