Tamil language : తమిళ భాష ‘అరవ భాష’ అని, తమిళులను ‘అరవ’ వాళ్ళు అని ఎందుకు అంటారు..
Tamil language మనం తమిళనాడు వాళ్ళను అరవ వాళ్ళు, వాళ్ళని భాషను అరవ బాష అని పిలుస్తాం. అరవ బాష, అరవం అన్న రెండు ఒకే లాంటి అర్ధం.. నిజానికి తెలుగు భాష మాట్లాడేవాళ్ళని తెలుగు వారు అని, కన్నడ భాష మాట్లాడేవాళ్ళని కన్నడిగులు అని, గుజరాతి మాట్లాడేవాళ్ళని గుజరాతీయులు అని.. ఇలా భాష ప్రాతిపదికన పిలుస్తూ ఉంటారు. కానీ ఒక్క తమిళులను మాత్రమే అరవ వాళ్ళు అరవ బాష అని పిలుస్తారు. మరి వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దామా..?
అఖండ మండల భారత దేశంలో వివిధ ప్రాంతాలను మండలాలుగా పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఉన్న మండలాలు వేరు, అప్పటి మండలాలు వేరు.. తమిళనాడు లో కూడా ఇలానే ఉండేది. ఒకప్పుడు మండలాలను రాష్ట్రాల లెక్కన చెప్పుకునేవారు. చోళ మండలం, పాండ్య మండలం..ఇలా ఉండేవి పేర్లు. అలాగే.. తొండై మండలం.. ఇది తమిళనాడు కు చెందినది. ఈ తొండై మండలం లోనే అరువనాడు ప్రాంతం ఉండేది. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలలో కూడా కొంతవరకు అరువనాడు కిందకే వచ్చేవి..
ఈ అరవనాడు అనేది తెలుగు ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో తమిళవాళ్లను తమిళులు అని కాకుండా అరవవాళ్ళు అని పిలిచేవాళ్ళు, వాళ్ళ భాషను కూడా అరవ బాష అని పిలిచేవాళ్ళు, ఇలా తమిళులను కేవలం మన తెలుగు వాళ్ళు మాత్రమే అరవం పేరు పెట్టి పిలుస్తాం.. ఇదే విధంగా కన్నడిగులు కూడా వారిని కొంగ అని,మలయాళీలకు పాండ్యనాడు అని పిలుస్తారు.. కన్నడ వాళ్లకు తమిళనాడు కు చెందిన కొంగనాడు అనే ప్రాంతం దగ్గరగా ఉండటంతో ఆ పేరుతో పిలుస్తారు.. అలాగే మలయాళీలకు పాండ్యనాడు దగ్గరగా ఉండటంతో పాండ్యలు, పాండీ అని పిలుస్తారు…
ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా తమిళ వాళ్లను ఎందుకు అరవవాళ్ళు అని పిలుస్తారో.. ఈ పేర్లు అన్ని చారిత్రాత్మకం గా వచ్చినవి మాత్రమే తప్ప, వేరే విధంగా కాదు. కానీ మనలో చాలామంది అరవం అనే దానికి సరైన అర్ధం తెలుసుకోకుండా తమిళోళ్ళు అరవోళ్లు అంటూ కొంచం వెటకారంగా మాట్లాడుతారు.. అది ముమ్మాటికీ తప్పు… చారిత్రాత్మకం గా ఏర్పడిన ప్రాంతాలను, పేర్లను మనం తప్పకుండా గౌరవించవలసి ఉంటుంది..