Madhya Pradesh – Rajasthan : మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లీడ్ లో బీజేపీ.. కాంగ్రెస్ కొన్ని చోట్ల ఆధిక్యంలో
ప్రధానాంశాలు:
Madhya Pradesh - Rajasthan : మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లీడ్ లో బీజేపీ..
కాంగ్రెస్ కొన్ని చోట్ల ఆధిక్యంలో
Madhya Pradesh – Rajastha : తెలంగాణ ఎన్నికల ఫలితాలతో పాటు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు లెక్కించిన ఫలితాల ప్రకారం ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ 44 స్థానాల్లో లీడ్ లో ఉండగా, బీజేపీ 45 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో లీడ్ లో ఉన్నారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ 78 స్థానాలు, బీజేపీ 149 స్థానాలు, ఇతరలు 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. రాజస్థాన్ లో 75 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ 113 స్థానాల్లో, ఇతరులు 11 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు.ఇక.. తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూస్తోంది.
కాంగ్రెస్ ఇప్పటి వరకు 64 స్థానాల్లో లీడ్ లో ఉండగా, బీఆర్ఎస్ 41 స్థానాలు, బీజేపీ 10 స్థానాలు, ఎంఐఎం 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. ఛత్తీస్ గడ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువగా గాలి వీస్తోందని చెప్పుకోవాలి.