7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో పెరగనున్న డీఏ.. భారీగా పెరగనున్న జీతం.. ఎంతో తెలుసా?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: June 19, 2023, 8:00 pm

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. గత మార్చిలో డీఏ పెరిగింది. మళ్లీ జూన్ లో పెరగాలి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను రెండు సార్లు కేంద్రం పెంచుతుంది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏను కేంద్రం పెంచుతుంది. ఈసంవత్సరం జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతం పెరిగింది. 4 శాతం పెరిగింది.

మళ్లీ రెండోసారి డీఏను పెంచితే.. డీఏ శాతం భారీగానే పెరగనుంది. అంటే.. ప్రస్తుతం ఉన్న 42 శాతం నుంచి మరో 4 శాతం పెరిగితే డీఏ.. 46 శాతం కానుంది. 46 శాతం డీఏ అయితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. అందుకే.. డీఏ, డీఆర్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే.. వచ్చే నెలలో డీఏ పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.అయితే.. పలు రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచాయి. ఒడిశా, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు డీఏను పెంచాయి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం డీఏను పెంచింది. దీని వల్ల.. 7.5 లక్షల ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

7th Pay Commission hike in salary announced for these govt employees

7th Pay Commission hike in salary announced for these govt employees

7th Pay Commission : పలు రాష్ట్రాల్లోనూ పెరిగిన డీఏ

హర్యానా ప్రభుత్వం కూడా 4 శాతం డీఏను ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెంచింది. తమిళనాడు ప్రభుత్వం కూడా డీఏను పెంచింది. ఈ రెండు రాష్ట్రాల్లో 38 శాతంగా ఉన్న డీఏ.. 4 శాతం పెరగడం వల్ల 42 శాతం అయింది. పలు రాష్ట్రాల్లో డీఏ పెరగడం వల్ల.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డీఏ పెంపు కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డీఏ 4 శాతం పెరిగితే.. 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp