Today Omicron Cases : భారత్ లో దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. రాష్ట్రంలో నిన్న 12 కేసులు.. అక్కడ థియేటర్లు బంద్..!
Today Omicron cases : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కేసులు దృష్ట్యా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. హర్యానాలో మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో.. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో సినిమా థియేటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, ఈత కొలన్లను మూసివేశారు.ఇక తెలంగాణ విషయానికొస్తే..ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. నిన్న 28,886 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 317 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,82,215కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.దీంతో మృతుల సంఖ్య 4,029కు చేరింది.
మహమ్మారి బారి నుంచి నిన్న 232 మంది కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 3,733 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కేసులు రోజురోజుకు ఇలాగే పెరుగుతూ పోతేబార్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులతోనే కార్యకలాపాలు నిర్వహించాలనే నిర్ణయాలతో పాటు.. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలానే సూచనలు వినిపిస్తున్నాయి.