Today Covid Update : బ్రేకింగ్ విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే 2,58,089 కరోనా కేసులు..!
Today Covid Update : దేశంలో కోవిడ్ మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఒక వైపు ఒమిక్రాన్ కేసులు, మరో వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 2 లక్షల 58 వేల 89 కేసులు నమోదయ్యి తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మహమ్మరితో తాజాగా 385 మంది మృత్యువాత పడ్డారు. ఇక డైలీ పాజిటివీటి రేటు 19.65 శాతంగా నమోదు చేసుకుంది. దేశంలో ప్రస్తుతం 16, 56, 341 యాక్టిివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8, 209కు చేరుకుంది. తాజాగా 1, 51, 740 మహమ్మారి నుంచి కోలుకున్నారు. అధిక శాతం కేసులు మహరాష్ట్ర చూశాయి. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. మూడో వేవ్ కి ఇదే ప్రారంభమని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది.

2022 january 17 today corona updates in india
ఒమిక్రాన్ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు. గత వారం రోజులుగా లక్షకు పైగా నమోదు అవుతూ వస్తున్న కరోనా కేసులు నేడు విపరీతంగా 2 లక్షలకు పైగా పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.