Job Recruitment 2022 : మజగావ్ డాక్‌లో పది అర్హతతో 1500 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..?
Job Recruitment 2022 : కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. మొత్తంగా 1501 ఉద్యోగ ఖాళీలు ఉండగా.. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారుు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. దరఖాస్తుకు ఫిబ్రవరి 8 తేదిని ఆఖరి తేదిగా నిర్ణయించారు.కంప్రెసర్ అటెండెంట్, బ్రాస్ ఫినిషర్, ఏసీ రిఫ్రిజిరేషన్, ఎలక్ట్రికల్ క్రేన్ ఆపరేటర్స్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, జూనియర్ క్యూసీ ఇస్పెక్టర్ , ప్లానర్ ఎస్టిమేటర్, స్టోర్స్ కీపర్, ఫిట్టర్, ఫైర్ ఫైటర్ , ఫైప్ ఫిట్టర్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
విద్యార్హతల విషయానికొస్తే వేర్వేరు పోస్టులకు అర్హతలు కేటాయించబడ్డాయి. పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఇంజినీరింగ్ డిప్లామా, ఐటీఐ చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు కాంటినెన్సీ ధృవపత్రం తప్పకుండా ఉండాలి.రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇందుకోసం అన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు సాధించిన మార్కులు, అనుభవం, ట్రెడ్, స్కిల్ టెస్టులో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం 30 మార్కులకు గాను జనరల్ నాలెడ్జ్ 10, క్యాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి మరో 10, టెక్నికల్ నాలెడ్జ్ నుంచి మరో 10 ప్రశ్నలు ఉంటాయి.
వయోపరిమితి జనవరి 1 వరకు 18 నుంచి 38 ఏళ్లలోపు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. https ://mazagondock.in/ను లాగిన్ అయ్యి.. కెరీర్స్‌లో ఆన్లైన్ రిక్రూట్‌మెంట్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. వివరాలు నమోదు చేసి మెయిల్‌కు వచ్చిన వ్యాలిడ్ లింక్ మీద క్లిక్ చేయాలి. తర్వాత mdl ఆన్లైన్ పోర్టర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ నమోదుచేసి లాగిన్ అవ్వాలి. తర్వాత కావాల్సిన జాబ్ ఎంపిక చేసి వివరాలు నమోదు చేయాలి.