Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఒకరకంగా చెప్పాలంటే బంగారం విషయంలో మహిళలకు ఇది పెద్ద బ్యాడ్ న్యూసే. ఎందుకంటే.. ఒకప్పుడు అంటే పది పదిహేనేళ్ల కింద బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా బంగారం ధరలు గత 10 ఏళ్లలో రెట్టింపు అయిపోయాయి. 10 గ్రాముల నాణ్యమైన బంగారం కొనాలంటే 50 వేలకు పైనే ఇప్పుడు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
తాజాగా ఇవాళ బంగారం ధరలు మళ్లీ కొండెక్కాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం, వెండి ధరలు ఏమేరకు పెరిగాయో.. తెలుసుకుందాం రండి.
ఇండియాలో 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.55 పెరిగింది. నిన్న ఒక గ్రాము బంగారం ధర రూ.4800 ఉండగా.. ఇవాళ రూ.4855 అయింది. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు రూ.48,550గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.550 పెరిగింది. 100 గ్రాములకు రూ.5500 పెరిగింది.
24 క్యారెట్లకు తీసుకుంటే.. ఒక గ్రాము బంగారం ధర రూ.5,296గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.59 పెరిగింది. నిన్న రూ.5237గా ఉండేది. 10 గ్రాములకు రూ.52,960గా ఉంది. నిన్నటి ధర రూ.52,370తో పోల్చితే రూ.590 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,550గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,970 కాగా.. 24 క్యారెట్లకు రూ.53,420గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా 24 క్యారెట్లకు రూ.52,960 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ 20 పైసలు పెరిగింది. 10 గ్రాములకు 2 రూపాయలు పెరిగింది. కిలో వెండి మీద రూ.200 పెరిగింది. భారత్ లో ఒక గ్రాము వెండి ధర రూ.64గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.640గా ఉంది. కేజీ వెండి ధర రూ.64 వేలుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూసుకుంటే.. హైదరాబాద్ లో 10 గ్రాములకు వెండి ధర రూ.692గా ఉంది. కేజీ వెండి ధర రూ.69200గా ఉంది. విజయవాడలో రూ.692, కిలో వెండి రూ.69200గా ఉంది. విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.
- Also Read