Today Corona Updates : బ్రేకింగ్.. లక్షన్నర కేసులతో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 1,41,986 కేసులు..285 మరణాలు.!

Authored By Inesh A | The Telugu News | Updated on: January 8, 2022, 10:28 am

Today Corona Updates : భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఒక వైపు ఒమిక్రాన్‌ కేసులు, మరో వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 1 లక్షా 41 వేల 986 కేసులు నమోదు కాగా.. 285 మంది మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా 40, 895 మంది మహమ్మారి భారీ నుంచి కోలుకోగా… దేశంలో ప్రస్తుతం 4, 72, 169 యాక్టిివ్ కేసులు ఉన్నాయి.

ఇక డైలీ పాజిటివీటి రేటు 9.28 శాతంగా నమోదు చేసుకుంది. మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3 వేల మార్క్ ను దాటింది. అధిక శాతం కేసులు మహరాష్ట్ర చూశాయి. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. మూడో వేవ్ కి ఇదే ప్రారంభమని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది.

2022 january 08 today corona updates covid and omicron cases in india

2022 january 08 today corona updates covid and omicron cases in india

ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

Inesh A

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp