Today Corona Updates : గుడ్ న్యూస్ కరోనా ఊరట.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కొవిడ్ కేసులు..!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 January 2022,10:00 am

Today Corona Updates : దేశంలో చాప కింద నీరులా వేగంగా ప్రవహిస్తూ వస్తున్నకరోనా మహమ్మారికి నేడు కాస్త బ్రేక్ పడింది. దేశంలో గత కొద్ది రోజులుగా 2 లక్షలకు పైగా నమోదు అవుతూ కరోనా కేసులు నిన్న భారీగా తగ్గగా.. నేడు కూడా అదే స్థాయిలో నమోదు అయ్యి కాస్త ఊరట కలిగించాయి. అయితే దేశవ్యాప్తంగా నిన్నతో పోలిస్తే నేడు కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 2 లక్షల 35 వేల 532 కేసులు నమోదయ్యి… మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.

డైలీ పాజిటివిటి రేటు 13. 39 శాతంగా నమోదయింది. మహమ్మరితో తాజాగా 871 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం 20, 04, 333 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 3, 35, 939 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.

2022 january 29 today corona updates

2022 january 29 today corona updates

అయితే ఒమిక్రాన్ పట్ల ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి