Today Gold Rates : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరలివే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరలివే!

Today Gold Rates : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్ళీ మంచి రోజులొచ్చాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు నేడు మరోసారి తగ్గుముఖం పట్టాయి. పలు ప్రాంతాల్లో నిన్న బంగారం ధరలు తగ్గగా.. తెలుగు రాష్ట్రాల్లో నేడు కాస్త తగ్గాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 150 […]

 Authored By kranthi | The Telugu News | Updated on :29 January 2022,8:05 am

Today Gold Rates : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్ళీ మంచి రోజులొచ్చాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు నేడు మరోసారి తగ్గుముఖం పట్టాయి. పలు ప్రాంతాల్లో నిన్న బంగారం ధరలు తగ్గగా.. తెలుగు రాష్ట్రాల్లో నేడు కాస్త తగ్గాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 300 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 250 గా ఉంది.

ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 250 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49, 250 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపిస్తోంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర భారీగా తగ్గి ఆయా చోట్ల ప్రస్తుతం రూ. 66, 300 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి.

2022 january 29 today gold rates in telugu states

2022 january 29 today gold rates in telugu states

నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది