Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్… తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం కొనడం గగనంగా మారిపోయింది. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొనాలంటే లక్షలు పోయాల్సి వస్తోంది. ఒకప్పుడు బంగారం అంటే పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. అందుకే తక్కువ ధరకే బంగారం లభించేది. కానీ.. నేడు బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరగడంతో.. ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం పెరుగుదలకు ఒక కారణం. ప్రస్తుతం ఒక తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైనే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
ఇండియాలో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.4710గా ఉంది. నిన్న ఇదే ఒక గ్రాము బంగారం ఆధర రూ.4740గా ఉండేది. అంటే.. ఒక గ్రాముకు రూ.30 తగ్గింది. 10 గ్రాములకు 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. నిన్న రూ.47,400గా ఉండేది. అంటే.. 10 గ్రాములకు రూ.300 తగ్గింది.
24 క్యారెట్లకు ఒక గ్రాముకు రూ.5138 కాగా.. నిన్న రూ.5170గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.32 తగ్గింది. 10 గ్రాములకు ఇవాళ రూ.51380 కాగా.. నిన్న రూ.51,700 గా ఉండేది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ రూ.320 తగ్గింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇక.. 22 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు చెన్నైలో రూ.48,410 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.52,810 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,100, 24 క్యారెట్లకు రూ.51,380గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.47,100, 24 క్యారెట్లకు రూ.51,380గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,380గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. 24 క్యారెట్లకు 51,380 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,380 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,380 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ రూ.62.30 గా ఉంది. ఒక గ్రాముకు ఇవాళ రూ.1.50 తగ్గింది. 10 గ్రాములకు రూ.623 గా ఉంది. ఒక కిలో వెండి ఇవాళ రూ.62,300 గా ఉంది. 10 గ్రాములకు 15 రూపాయలు తగ్గగా… కిలో వెండి పేరు మీద రూ.1500 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.665 గా ఉంది. కిలో వెండి ధర రూ.66500గా ఉంది. విజయవాడలో 10 గ్రాములకు రూ.665 కాగా.. కిలో వెండి ధర రూ.66500 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది. 10 గ్రాములకు రూ.665 కాగా… కిలో వెండి ధర రూ.66500 గా ఉంది.