TRS : టీఆర్ఎస్ కు భారీ షాక్… ఆ పార్టీలో చేరిన 400 మంది?
TRS : నాగార్జున సాగర్ ఉపఎన్నిక అయిపోగానే… మరో ఎన్నికల పోరు జరగనుంది. తెలంగాణలో ఎన్నికలే ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక ఎన్నిక అయిపోగానే… మరో ఎన్నిక. వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశాయి. వరంగల్, ఖమ్మానికి మకాన్ని మార్చాయి. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ రాజకీయాలన్నీ మారిపోతున్నాయి. రాత్రికి రాత్రే రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి.
తాజాగా… ఖమ్మం మున్సిపల్ ఎన్నికల రణభేరీని సీఎల్పీ నేత భట్టి వక్రమార్క ప్రారంభించారు. మామిళ్లగూడెంలో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించింది. ఈ సభకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన 400 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. అనంతరం మాట్లాడిన భట్టి విక్రమార్క.. టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అలాగే స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ పై కూడా భట్టి విమర్శలు గుప్పించారు.
TRS : మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది
ఈ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ నమ్మకం నాకుంది. టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేక.. మునిసిపిల్ ఎన్నికల వేళ… 400 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఇదొక్కటి చాలు… ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎలా ఆదరిస్తున్నారో చెప్పడానికి. ఖమ్మంలో ఉన్న సమస్యలను టీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పుడు సమస్యలను పక్కన పెట్టి…. కేవలం అధికారం, డబ్బును అడ్డం పెట్టుకొని ఖమ్మంలో గెలవాలని చూస్తోంది. మద్యాన్ని ఏరులై పారించి… ఓటర్లను తమ వైపునకు తిప్పుకొని…. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తోందంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు.