5G Phones : 20 వేల లోపు బడ్జెట్ ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ కావాలా? ఇదిగో ఈ ఫోన్లను ఒకసారి చూడండి
5G Phones : భారత్ లో త్వరలో 5జీ రాబోతోంది. ప్రస్తుతం 4జీ కాలం నడుస్తున్నా.. త్వరలో 5జీ ని భారత్ లో తీసుకురానున్నారు. ఈనేపథ్యంలో 5జీ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల బ్రాండ్స్.. 5జీ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే.. 5జీ ఫోన్లు అంటే కొంచెం కాస్ట్ లీ ఉండటం వల్ల.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ ఫోన్లు కొనడం కష్టమే.అయితే.. బడ్జెట్ ధరలోనే అది కూడా 20 వేల లోపే కొన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్.. బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. మరి ఆ ఫోన్లపై ఓ లుక్కేసుకోండి మరి.
రియల్ మీ నార్జో 30 5జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.14,999 కే లభించనుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో నడవనున్న ఈ ఫోన్ లో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. 48 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉండనున్నాయి.Realme x7 5G ఫోన్ ను రూ.19,999 కే అందిస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్, 6.4 ఇంచ్ డిస్ ప్లే, 64 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.

5g smartphones under 20000 rupees from various brands
5G Phones : రూ.14,999 కే Realme Narzo 30 5G ఫోన్
Vivo T1 5G ఫోన్ ధర రూ.15,990 గా ఉంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 ఓస్, 50 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లు ఉంటాయి.Realme 8S 5G ఫోన్ ధర రూ.17,999 గా ఉంది. ఈ ఫోన్ లో 6.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 64 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లు ఉన్నాయి.