SmartPhone : మీ ఫోన్ సేఫ్‌గా ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే..
SmartPhones : ప్రస్తుతం స్మార్ ఫోన్ అనేది మనిషి జీవితంలో భాగమైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వారుకే చాలా మందికి ఇదే ప్రపంచం. కొందరు ఆఫీస్ వర్క్స్ కోసం యూజ్ చేస్తే మరికొందరు టైం పాస్ కోసం యూజ్ చేస్తారు. కానీ అందరూ తమ ఫోన్ సేఫ్టీ కోసం ఆలోచిస్తుంటారు. మరి వాటికి సంబంధించిన కొన్ని టిప్స్ తెలుసుకుందాం. చాలా వరకు స్మార్ట్ ఫోన్స్‌లో యాప్స్‌లో మాల్‌వేర్ నిత్యం కలకలం రేపుతూ ఉంటోంది. ప్రతీసారి పదుల సంఖ్యలో ఆండ్రాయిడ్ యాప్స్‌లో మాల్‌వేర్ బయటపడుతుంటాయి. దీంతో స్మార్ట్ ఫోన్ యూజర్స్‌ను భయపెడుతోంది.
మాల్ వేర్ ఉన్న యాప్స్ ను గూగుల్ గుర్తించి తొలగిస్తూ ఉన్నా.. అప్పటికే అలాంటి యాప్స్ యూజర్స్ ఫోన్లలో డౌన్ లోడ్ అయి ఉంటాయి. వీటి పట్ల జాగ్రత్త అవసరం. మీ మొబైల్స్‌లో గూగుల్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఆండ్రాయిడ్ వస్తుంటాయి. తరచూ ఫోన్ ను అప్ డేట్ చేయకపోతే వైరస్ ను గుర్తించడం కష్టమవుతుంది.ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో Kaspersky Internet Security సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేయాలి.Kaspersky Lab రూపొందించిన యాప్ మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి.
SmartPhones : ఇలా చేయండి
అనంతరం క్యాస్పర్ స్కీ యాప్ ఓపెన్ చేయాలి. టర్మ్స్ అండ్ కండీషన్స్ ఓకే అనాలి. యాప్ పర్మిషన్స్ ఇచ్చెయ్యాలి. ఆ తర్వాత రెడీ టు స్కాన్ మెసేజ్ కనిపిస్తుంది. స్కాన్ బటన్ ప్రెస్ చేయాలి. స్కానింగ్ పూర్తయిన తర్వాత అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తాయి. ఫోన్‌లో వైరస్ ఉంటే క్యాస్పర్ స్కీ యాప్ గుర్తిస్తుంది. ఆ వైరస్‌ను మీ స్మార్ట్‌ఫోన్ నుంచి తొలగించాలి. ఏదైనా యాప్‌లో వైరస్ ఉంటే అన్ ఇన్ స్టాల్ మెసేజ్ కనిపిస్తుంది. దానిని వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయాలి. అనంతరం ఫోన్ ను ఒకసారి రీ స్టార్ట్ చేయాలి.