Women Allergic : ఈ వ్యక్తికి ఆడవాళ్లు అంటే ఎలర్జీ .. వాళ్లు ఎదురుగా ఉంటే ఏం చేస్తాడో తెలుసా..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women Allergic : ఈ వ్యక్తికి ఆడవాళ్లు అంటే ఎలర్జీ .. వాళ్లు ఎదురుగా ఉంటే ఏం చేస్తాడో తెలుసా..??

 Authored By aruna | The Telugu News | Updated on :15 October 2023,8:00 pm

Women Allergic : మనుషులు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఉంటారు. ఒకరికి నచ్చిన వస్తువు మరొకరికి నచ్చదు. అలాగే కొన్ని విషయాలలో ఇద్దరు మనుషులతో అస్సలు పోలిక ఉండదు. అలాగే కొందరికి ఆడవాళ్లను చూస్తే గౌరవం ఇస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఆడవాళ్లను చూడగానే భయపడి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంటాడట. అతడు ఆడవాళ్ళను చూడగానే దెయ్యంగా భావించి వణికి పోతాడట. వింత క్యారెక్టర్ ఉన్న ఈ వ్యక్తి గురించి జనాలు తెగ చర్చించుకుంటున్నారు. రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలీలెక్స్ నజాంబిటా చూడటానికి నలుపు రంగులో ఉన్నాడు. అంతేకాకుండా వింత మనిషిలా కనిపిస్తున్నాడు. అతనికి వింత వ్యక్తిత్వం ఉంది.

అతడు ఎక్కువగా అడవిలో సంచరిస్తూ ఉంటాడు. అయితే ఈయనకు పదహారేళ్లు ఉన్నప్పుడే ఆడవాళ్లు అంటే చాలా భయం అనేది మొదలైందట. అప్పటినుంచి ఎవరు ఆడవాళ్లు కనిపించిన వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటాడట. అయితే ఇతడు ఆడవాళ్లకు మాత్రమే కాకుండా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నాడు. ఇతర మనుషులు అంటే అస్సలు గిట్టదట. అయితే అతనికి కొందరు ఆహారం అందిస్తున్నారు. ఇతరులతో ఎక్కువగా కలివిడిగా ఉండకుండా ఏ పని చేయకుండా ఉండడంతో ఇతడికి భోజనానికి సంబంధించిన వస్తువులు ఆడవాళ్లు మాత్రమే తేవడం విశేషం.

71 year old man runs in fear with a female allergy

71-year-old-man-runs-in-fear-with-a-female-allergy

అయితే వారు వస్తువులను తెచ్చేటప్పుడు అతడి ఇంటి బయటే పెట్టేసే వెళతారట. ఆ తర్వాత అతడు బయటికి వచ్చి వస్తువులను తీసుకొని వెళతాడట. ఆడవారిపై ఇలా ద్వేషం పెంచుకున్న అతడిపై కొందరు పరిశోధన కూడా చేశారు. అతనికి గైనో ఫోబియా వ్యాధి ఉందని తేల్చారు. ఆడవారి పట్ల ఉండే అహేతుకమైన భయాన్ని గైనో ఫోబియా అంటారు. దీని లక్షణాలు ఏంటంటే ఆడవారిని చూడగానే వీరిలో ఒక రకమైన భయం ఏర్పడుతుంది. వారితో అస్సలు మాట్లాడారు. చాతి పట్టేసినట్లుగా, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనబడతాయట.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది