7th Pay Commission : 18 నెలల డీఏ బకాయిలు త్వరలో అకౌంట్లలోకి.. హోలీ పండుగ ముందే వచ్చేస్తోంది
7th Pay Commission : త్వరలో రాబోయేది హోలీ పండుగ. ఆ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హోలీ అంటేనే రంగుల పండుగ. ఆ పండుగను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో జరుపుకోబోతున్నారు. అది కూడా మూడు శుభవార్తలతో. అవును.. ఒకేసారి కేంద్ర ప్రభుత్వం మూడు శుభవార్తలను తీసుకొచ్చింది. 18 నెలల డీఏ బకాయిలు, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్, డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
18 నెలల డీఏ బకాయిలపై కేంద్రం చాలా రోజుల నుంచి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే. కరోనా సమయంలోని బకాయిలు అవి. 18 నెలల బకాయిలు ఒకేసారి అకౌంట్లలో జమ చేస్తారని చెప్పినా ఇంకా అవి జమ కాలేదు. దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ.. హోలి వరకు డీఏ బకాయిలపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 18 నెలల బకాయిలు జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు రావాల్సి ఉంది.
7th Pay Commission : ఒకేసారి రూ.2.16 లక్షలు 18 నెలల డీఏ బకాయిలు పొందే అవకాశం
ఒకసారి కేంద్రం నిర్ణయం తీసుకుంటే 18 నెలల బకాయిలు ఒకేసారి రూ.2.16 లక్షలు అకౌంట్లలో పడనున్నాయి. అలాగే.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై కూడా త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఫిట్ మెంట్ పెంచితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఒకేసారి పెరగనున్నాయి. అది కూడా వచ్చే నెలలో నిర్ణయం ఉండనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు డీఏను కూడా పెంచనున్నట్టు తెలుస్తోంది. డీఏను 3 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గత సంవత్సరం సెప్టెంబర్ లో 4 శాతం డీఏ పెరిగింది. మొత్తానికి హోలీ సందర్భంగా ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కసారిగా మూడు బెనిఫిట్స్ అందనున్నాయి.