7th Pay Commission : గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా.. డీఏ తో పాటు జీతం భారీగా పెంపు..!!
7th Pay Commission : ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా విలువైనదిగా చెప్పవచ్చు.జనవరి నెల నుంచి డీఏ 50% కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఏఐసీపీఐ ఇండెక్స్ అదే చెబుతుంది. ప్రతినెలా విడుదలయ్యే ఇండెక్స్ ఆధారంగా ఏడాదికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతుంది. మొదటిసారి జనవరి నెలలో రెండవసారి జూలైలో పెంపు ఉంటుంది. అయితే ఈసారి జరిగే పెంపుతో డీఏ 50 శాతానికి చేరుకోనుంది. దాంతో కేంద్ర […]
7th Pay Commission : ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా విలువైనదిగా చెప్పవచ్చు.జనవరి నెల నుంచి డీఏ 50% కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఏఐసీపీఐ ఇండెక్స్ అదే చెబుతుంది. ప్రతినెలా విడుదలయ్యే ఇండెక్స్ ఆధారంగా ఏడాదికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతుంది. మొదటిసారి జనవరి నెలలో రెండవసారి జూలైలో పెంపు ఉంటుంది. అయితే ఈసారి జరిగే పెంపుతో డీఏ 50 శాతానికి చేరుకోనుంది. దాంతో కేంద్ర ప్రభుత్వాలకు డబుల్ బోనాంజా కింద మరో ప్రయోజనం చేకూరనుంది. డీఏ ఒక్కటే కాదు జీతం కూడా భారీగా పెరగనుంది. డీఏ పెంపు ఆమోదం పొందడంతో పాటే జీతంలో భారీగా పెరుగుదల కనిపిస్తుంది. అంటే ఒకే దెబ్బకు జీతం ఏకంగా రూ. 9,000 పెరగనుంది.
కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం కేంద్ర క్యాబినెట్ డీఏ పెంపుపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున మార్చి వరకు చూడాల్సి ఉంది. డీఏ పెంపు ఆమోదంతో డీఏ 50 శాతానికి చేరుకోగానే జీతం నేరుగా తొమ్మిది వేల రూపాయలు పెరగనుంది. మరోవైపు 8వ వేతన సంఘం ఏర్పాటుకు దారి తీయనుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ పెరుగుతుంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 46% డీఏ వస్తుంది. జనవరి 2024 నుంచి మరో 4 శాతం పెరగనుంది. అదే అమల్లోకి వస్తే 50 శాతానికి డీఏ చేరుకోనుంది. 2016 లో వచ్చిన నిబంధనల ప్రకారం డీఏ ఒకసారి 50% చేరుకోగానే ఆ మొత్తం బేసిక్ శాలరీలో కలిపి డీఏ ను జీరో చేస్తారు.
ఈ నిబంధన ప్రకారం అప్పటివరకు ఉన్న 50 శాతం డీఏ నేరుగా కనీస వేతనంలో కలపాల్సి ఉంటుంది. 2016లో ఆరవ వేతన సంఘం అమలులో ఉండగా అదే జరిగి డీఏ సున్నాకు చేరింది. ఏడవ వేతన సంఘం ఏర్పడింది. ఇప్పుడు తిరిగి అదే పరిస్థితి. ఏడవ వేతన సంఘం పూర్తిగా కావస్తుంది. ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బెడ్ లెవెల్ బేసిక్ శాలరీ 18000. ప్రస్తుతం డీఏ గా 7560 రూపాయలు వస్తుంది. డీఏ జనవరి నుంచి 50% చేరుకుంటే అదే 9 వేలు అవుతుంది. 2016 నిబంధన ప్రకారం డీఎ 50 శాతానికి చేరుకోగానే 9,000 డీఏ ను బేసిక్ శాలరీలో కలిపి డీఏ జీరో చేస్తారు. అంటే 18 వేల రూపాయలను బేసిక్ శాలరీ కాస్త ఒకేసారి 27,000 అవుతుంది. ఇకనుంచి డీఏ అనేది 27 వేల పై లెక్కించడం మొదలవుతుంది. డీఏ సున్నాకు చేరిన తర్వాత మూడు శాతం డీఏ పెరిగితే 27 వేల లెక్కిస్తే 810 రూపాయలు నెలకు మరోసారి పెరగవచ్చు.