7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హోలీకి నాడు పెరగనున్న ఫిట్ మెంట్.. ఎంతో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ హైక్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. డీఏ పెంపుతో పాటు హోలీ పండుగ సందర్భంగా ఉద్యోగులకు ఫిట్ మెంట్ ను కూడా కేంద్రం పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హోలీ తర్వాత బేసిక్ వేతనం పెరుగుతుందట. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై చాలా రోజుల నుంచి ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే. కానీ.. హోలీ సందర్భంగా త్వరలోనే
నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది.ఫిట్ మెంట్ ను పెంచితే.. ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనం ఉన్న వాళ్లు అంటే రూ.18,000 ఉన్న వాళ్లు రూ.26,000 కు పెరుగుతుంది. దీని వల్ల భారీగా జీతం పెరగనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2.57 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను పొందుతున్నారు. కానీ.. ప్రస్తుతం ఉన్న 2.57 ఫిట్ మెంట్ ను పెంచి 3.68 కు చేయాలని చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
7th Pay Commission : 3.68 కు పెంచితే రూ.26 వేలకు పెరగనున్న బేసిక్ వేతనం
ఒకవేళ 3.68 కు పెంచితే.. బేసిక్ వేతనం కనీసం రూ.26 వేలు కానుంది. మార్చిలో డీఏ పెంపు ప్రకటన ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం డీఏ 34 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. దాన్ని 38 శాతానికి చేయనున్నారు. 3 నుంచి 5 శాతం మధ్యలో డీఏను పెంచాలని అనుకున్నా దానిపై ఇంకా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డీఏ, ఫిట్ మెంట్ రెండింటిపై ఒకేసారి హోలీ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.