7th Pay Commission : గుడ్ న్యూస్.. డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచిన ప్ర‌భుత్వం

Authored By Sam C | The Telugu News | Published on: August 16, 2022, 6:00 pm

7th Pay Commission : గ‌త కొద్ది రోజులుగా డీఏ పెంపుపై అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను జనవరి 2022 నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏను 3 శాతం పెంచాలని నిర్ణయించారు. 7వ వేతన సంఘం డీఏ పెంపు జూలైలో వస్తుందని ఆశించారు. కానీ డీఏ పెంపుపై కీలక నిర్ణయం ఆగస్టు నెలలో తీసుకోనున్నారని తెలుస్తోంది. కరవు భత్యం పెంపు దాదాపు ఖరారైనా, ఎంతమేరకు పెంచుతారనేది కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం అనంతరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం 40 వేలవరకూ పెరగవచ్చని తెలుస్తోంది.

7th Pay Commission : భారీ పెంపు..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు 75వ స్వాతంత్య్ర దినోత్స‌వ సంద‌ర్భంగా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1, 2022 నుండి అమలులోకి వచ్చే ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిర్ణయించారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 9.38 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాపై రూ.1400 కోట్ల భారం పడనుంది. ఇప్ప‌టికే త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి.

7th pay commission da 3 percent increased

7th pay commission da 3 percent increased

త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 5 శాతం పెంచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.523.80 కోట్ల భారం పడనుంది. అలాగే ఈ నిర్ణయంతో మొత్తం 1,88,494 మంది లబ్ధి పొందనున్నారు. ఇందులో ప్రస్తుతం ఉన్న 1,04,683 మంది ఉద్యోగులతో పాటు 80,855 మంది పెన్షనర్లు ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను కూడా 39 శాతానికి పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరువు భత్యం పెంపుపై మోదీ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. దీని కోస‌మే అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. గుడ్ న్యూస్ ఎప్పుడు ఎలా వ‌స్తుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp