7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ, డీఆర్ పెంపుకు గ్రీన్ సిగ్నల్.. అకౌంట్ లో ఎంత జమ కానుందో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ, డీఆర్ పెంచుతుంది అనే విషయం తెలిసిందే. ఇటీవలే కేంద్రం డీఏ పెంచిన విషయం తెలిసిందే. కేంద్రంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు డీఏను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు డీఏను పెంచాయి. దసరా, దీపావళి సందర్భంగా డీఏ, డీఆర్ ను పెంచాయి. తాజాగా యూపీ, హర్యానా ప్రభుత్వం కూడా దీపావళి గిఫ్ట్ ను తమ ప్రభుత్వ ఉద్యోగులకు అందించాయి. హర్యానా ప్రభుత్వం తమ ఉద్యోగులకు డీఏను పెంచింది.
ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను 34 శాతం నుంచి 38 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జులై 1, 2022 నుంచి పెరిగిన డీఏ అమలులోకి రానుంది. మూడు నెలల బకాయిలతో పాటు పెరిగిన డీఏ దీపావళి కానుకగా ఈ నెల జీతంతో పాటు పడనున్నాయి. బేసిక్ జీతం రూ.56,900 ఉన్నవాళ్లకు కొత్త డీఏ రూ.2276 పెరగనుంది. అంటే సంవత్సర జీతంలో రూ.27,312 పెరగనున్నాయి. రూ.18 వేలు బేసిక్ వేతనం ఉన్న వాళ్లకు పెరిగిన డీఏ రూ.720 గా ఉండగా.. సంవత్సరానికి డీఏ పెంపు రూ.8640 గా ఉంటుంది.
7th Pay Commission : 4 శాతం డీఏ పెంచిన యూపీ ప్రభుత్వం
కేంద్రం డీఏ పెంచగానే.. యూపీ ప్రభుత్వం కూడా డీఏను 4 శాతం పెంచింది. జులై 1 నుంచి పెరిగిన డీఏ అమలులోకి రానుంది. 2021-22 సంవత్సరానికి గాను యూపీ ప్రభుత్వ ఉద్యోగులకు రూ.6908 బోనస్ ను పెంచనున్నట్టు సీఎం యోగీ ట్వీట్ చేశారు. జార్ఖాండ్ ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏను పెంచుతున్నట్టు ప్రకటించింది. జులై 1, 2022 నుంచి పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది.