7th Pay Commission : డీఏ భారీగా పెంచే ఆలోనలో సర్కారు.. ఇక జీతాలు భారీగా పెరగడం ఖాయం..!
7th Pay Commission : సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం లేదా 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి కలిపి ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతుంది. ఈ ఏడాది జూలైలో డీఏ పెరగనుంది. ఈసారి ఉద్యోగులకు, పెన్షనర్లకు 5 శాతం డీఏ, డీఆర్ పెరగనుందన్న వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారు మరో 5 శాతం డీఏ పెంచేందుకు సిద్ధమవుతోందని సమాచారం. కేబినెట్ గనక ఇందుకు ఆమోదం తెలిపితే 34 శాతంగా ఉన్న కరవుభత్యం ఏకంగా 39కి పెరుగుతుంది. ఏడాదికి రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం కరవుభత్యం ప్రకటిస్తుంది.
జనవరి, జులై నుంచి వీటిని అమలు చేస్తుంటారు.ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో ఈసారి ఎక్కువ డీఏ ఇస్తారని సంకేతాలు అందుతున్నాయి. ఆల్ ఇండియా సీపీఐ ఆధారంగా ఉద్యోగులకు డీఏ నిర్ణయిస్తారు. ఈ సారి ధరలు మండిపోతుండటంతో ప్రతి నెలా సూచీ పెరుగుతోంది. 2021 డిసెంబర్లో ఏఐసీపీ 125.4గా ఉంది. డీఏ పెంపునకు దీనినే పరిగణనలోకి తీసుకున్నారు. ఆ తర్వాత సూచీ 0.3 పాయింట్ల పడిపోయి 125.4కు చేరుకుంది. 2022 ఏప్రిల్‌లో 1.7 శాతం పెరిగి 127.7కు చేరింది. నెల రోజుల వ్యవధిలోనే 1.35 శాతం పెరిగింది. ద్రవ్యోల్బణం సైతం 6.33 శాతానికి చేరింది. ఆహార ద్రవ్యోల్బణమైతే 7.05 శాతంగా ఉంది. అందుకే అధిక డీఏకు ఆస్కారం ఉంది.
7th Pay Commission : జీతాలు పైపైకి..
2022 జనవరికి సంబంధించిన డీఏను మార్చి 30న పెంచారు. 3 శాతం ప్రకటించడంతో 31గా డీఏ 34 శాతానికి చేరింది. ఈసారి ధరలు మరీ కొండెక్కడంతో ఏకంగా 5 శాతం వరకు కరవుభత్యం పెంచేందుకు ఛాన్స్ ఉంది. అదే జరిగితే 34గా ఉన్న డీఏ 39కి చేరుతుంది. అలాగే జులై నుంచి బేసిక్ సాలరీలో మార్పు చేస్తారని తెలిసింది. గతంతో పోలిస్తే ఎక్కువ మూల వేతనం వస్తుందని సమాచారం. దీనివల్ల కోటిన్నర ఉద్యోగులకు లాభం చేకూరుతుంది. అలాగే జూలై మాసం నుంచి బేసిక్ జీవితాల్లోనూ మార్పులు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.