7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డబుల్ దమాకా.. భారీగా పెరగనున్న జీతాలు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత మార్చిలో డీఏ పెరిగిన విషయం తెలుసు కదా. మళ్లీ మరోసారి డీఏ పెంచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల అంటే జులైలో డీఏ పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెంచుతుంది. జనవరి, జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెరుగుతుంది.
ఈసంవత్సరం జనవరిలో పెరగాల్సిన డీఏను మార్చిలో పెంచింది. జనవరి, ఫిబ్రవరి బకాయిలను కూడా అందిస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది. జనవరి 1, 2023కు సంబంధించి మార్చిలో 4 శాతం డీఏ పెరిగింది. మరో 4 శాతం డీఏను జులై పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీఏ, డీఆర్ తో పాటు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై కూడా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
7th Pay Commission : డీఏ, ఫిట్ మెంట్ ఒకేసారి పెరిగితే భారీగా పెరగనున్న జీతాలు
డీఏ, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఒకేసారి పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు.. పలు రాష్ట్రాలు కూడా తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ ను పెంచుతున్నాయి. 4 శాతం డీఏ, డీఆర్ ను యూపీ ప్రభుత్వం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇదివరకు 38 శాతం డీఏ ఉండేది. 4 శాతాన్ని పెంచి 42 శాతం పెరిగింది. కర్ణాటకలోనూ డీఏ 4 శాతం పెరిగింది. తమిళనాడులోనూ డీఏ 4 శాతం పెరిగింది. హర్యానా ప్రభుత్వం కూడా తాజాగా డీఏను 38 నుంచి 42 శాతానికి పెంచింది.