7th Pay Commission : కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు..!
7th Pay Commission : ఎంతైనా గవర్నమెంట్ జాబును మించిన జాబు మరొకటి ఉండదేమో కదా. ఎందుకంటే ఎన్ని రకాల వసతులు ఉండాలో అన్నీ ఉంటాయి. అందుకే ఉంటే బిజినెస్ ఉండాలి లేదంటే గవర్నమెంట్ జాబ్ ఉండాలి అంటారు. ఇందుకేనేమో కావచ్చు. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు డీఏతో పాటు డీఆర్ పెంచాలని ఎప్పటి నుంచో అభ్యర్థిస్తున్నారు. కాగా వారందరికీ ఈ రోజు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.
అయితే త్వరలోనే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ను భారీగా పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ అయితే ఫిట్‌మెంట్ ను గనక కేంద్రం ఇన్ క్రీస్ చేస్తే కచ్చితంగా వారి జీతాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం 2.57 రెట్లుగా ఫిట్‌మెంట్ ఉంది. కాగా దీన్ని 3.68 గా పెంచాలని కేంద్రం నిర్ణయించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఫిట్ మెంట్ ప్యాక్టర్‌ను కేంద్రం పెంచితే ప్రస్తుతం రూ.18,000 గా ఉన్న కనీస వేతనం రూ.26,000 అవుతుంది.

7th pay commission good news for central government employees huge increase in salaries
7th Pay Commission: మార్చిలో పెరిగే ఛాన్స్..
కాగా బేసిక్ వేతనం పెరిగితే ఆటోమేటిక్ గా డీఏ, ఇతర అలవెన్స్‌లను పెంచుతారు. ప్రస్తుతం కేంద్రం ఏడాదిలో రెండు సార్లు DA పెంచుతోంది. ఏటా జనవరితో పాటు జులై నెలల్లో ఈ డీఏను కేంద్రం ఇన్ క్రీస్ చేస్తోంది. అయితే ఈ డీఏ పెంపు ఈసారి మార్చిలో ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కేంద్రం గనక ఈ ఫిట్ మెంట్ పెంచితే ఈ ప్రయోజనం దాదాపు 47.14 లక్షల మందికి లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాగా ఇది కేంద్రం మీద ఆర్థిక భారాన్ని పెంచే అంశమే అయినా.. ఇందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది.