7th Pay Commission : కేంద్ర ఉద్యోగులకు షాకిచ్చిన కేంద్రం.. 18 నెలల డీఏ బకాయిల చెల్లింపుపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఉద్యోగులు, పెన్షనర్లు దీనికి అంగీకరిస్తారా?
7th Pay Commission : దేశంలో 2020 మార్చి తర్వాత కరోనా ప్రభావం ఎక్కువైన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, Central Government Employeesకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏను కేంద్రం ఆపేసింది. దాదాపుగా 18 నెలల , డీఏ, DA బకాయిలను కేంద్రం నిలిపివేసింది. ఇదిగో ఇస్తారు.. అదిగో ఇస్తారు అంటూ ఉద్యోగులను ఊరించింది. చివరకు.. 18 నెలల బకాయిలను కొత్త సంవత్సరం కానుకగా పెన్షనర్లకు కేంద్రం ఇవ్వనుందని అన్నారు కానీ.. దానిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
తాజాగా.. రాజ్యసభలో డీఏ బకాయిలపై జరిగిన చర్చలో కేంద్రం బకాయిల చెల్లింపులపై స్పష్టతనిచ్చింది. కాంగ్రెస్ రాజ్యసభ మెంబర్ నారన్ భాయ్ రత్వా అడిగిన ప్రశ్నకు బదులుగా.. ఆర్థిక మంత్రత్వ శాఖ బదులిచ్చింది. ఇప్పటికే ప్రభుత్వానికి 18 నెలల డీఏ బకాయిల చెల్లింపుపై కేంద్రానికి పలు రెప్రజెంటేషన్స్ వచ్చాయని తెలిపింది. దీనిపై కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించే డీఏ, డీఆర్ చెల్లింపులను ప్రస్తుతానికి పెండింగ్ లో పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని..
7th Pay Commission : ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బకాయిలను ఫ్రీజ్ చేసిన ప్రభుత్వం
అందుకే.. మూడు ఇన్ స్టాల్ మెంట్స్ లో చెల్లించాల్సిన డీఏ, డీఆర్ బకాయిలను చెల్లించడంపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం ఇంకా తీసుకోలేదు కాబట్టి.. ప్రస్తుతానికి బకాయిల చెల్లింపు నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో డీఏ బకాయిలను విడుదల చేయడం కుదరదని.. త్వరలోనే కేంద్రం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పుకుచ్చారు. దీంతో మరోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశే ఎదురైంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో కూడా వాళ్లకు నిరాశే ఎదురైంది.