7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం LTC నియమాలను మార్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం LTC నియమాలను మార్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

7th Pay Commission : 7వ వేతన సంఘం కింద LTC నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గించేందుకు కొన్ని నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు విమానాల‌లో ట్రావెట్ క్లాసులో అతి త‌క్కువ ధ‌ర ఉన్న టికెట్ క్లాస్‌ని ఎంచుకోవాల‌ని, ప‌ర్య‌న‌టన‌లు, ఎల్టీ సీ క‌లిపిమూడు వారాల క‌న్నా ముందే టికెట్ బుక్ చేసుకోవాల‌ని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులకు, వారి జీతంలో లీవ్ ట్రావెల్ కన్సెషన్ చాలా ముఖ్యమైన అంశం. ఇది వారికి విమానం […]

 Authored By sandeep | The Telugu News | Updated on :22 June 2022,6:00 pm

7th Pay Commission : 7వ వేతన సంఘం కింద LTC నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గించేందుకు కొన్ని నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు విమానాల‌లో ట్రావెట్ క్లాసులో అతి త‌క్కువ ధ‌ర ఉన్న టికెట్ క్లాస్‌ని ఎంచుకోవాల‌ని, ప‌ర్య‌న‌టన‌లు, ఎల్టీ సీ క‌లిపిమూడు వారాల క‌న్నా ముందే టికెట్ బుక్ చేసుకోవాల‌ని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులకు, వారి జీతంలో లీవ్ ట్రావెల్ కన్సెషన్ చాలా ముఖ్యమైన అంశం. ఇది వారికి విమానం లేదా రైలు లేదా రోడ్డు ద్వారా ప్రయాణించే సౌకర్యాన్ని అందిస్తుంది మరియు ప్రయాణ ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అయితే, కొత్త నిబంధనలు కొంతమంది ఉద్యోగులకు ఆందోళన కలిగించే విషయం.

7th Pay Commission : ఎల్‌టీసీ కొత్త రూల్స్..

ఒక టికెట్ మాత్రమే: ఈ నియమం ప్రకారం, ఉద్యోగులు ప్రతి ప్రయాణానికి 1 టికెట్ మాత్రమే బుక్ చేసుకోగలరు. అంతేకాకుండా, టిక్కెట్లను ట్రావెలింగ్ ఏజెంట్ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.

7th Pay Commission ltc New update

7th Pay Commission ltc New update

ఉదాహరణకు : IRCTC, బోమర్ లారీ & కంపెనీ మరియు అశోక్ ట్రావెల్స్. క్యాన్సిలేష‌న్ నివారించండి: ఉద్యోగులు తమ టిక్కెట్లను రద్దు చేయకుండా ఉండవలసిందిగా కూడా పేర్కోన‌బ‌డింది. రద్దు చేస్తే తెలియ‌జేయండి: టిక్కెట్‌లను రద్దు చేయడానికి కారణాన్ని ఉద్యోగులు 72 గంటల్లోగా వివరణ సమర్పించాలి. అలాగే వారు ఏజెంట్లకు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. ప్ర‌యాణానికి సంబంధించి 72 గంట‌ల‌లోపు బుక్ చేసిన‌, 24 గంట‌ల క‌న్నా త‌క్కువ వ్య‌వ‌ధిలో ర‌ద్దు చేసిన ఉద్యోగి స్వ‌యంగా జ‌స్టిఫికేష‌న్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అన‌ధికారిక ట్రావెల్ ఏజెంట్స్, వెబ్ సైట్స్ నుండి టికెట్ బుకింగ్ చేసే ప‌రిస్థితులు ఏర్ప‌డితే జాయింట్ సెక్ర‌ట‌రీ లేదా అంత‌క‌న్నా ఎక్కువ స్థాయి అధికారి మాత్ర‌మే స‌డ‌లింపులు మంజూరు చేయాల్సి ఉంటుంది.

8వ పే కమిషన్‌పై తాజా అప్‌డేట్ : రానున్న రోజుల్లో పే కమిషన్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్రం యోచిస్తోందని తెలుస్తుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం ఎప్పుడూ ఉండకపోవచ్చు. ప్రయివేట్ రంగంలోని వ్యవస్థ మాదిరిగానే ఉద్యోగి పనితీరును పరిగణనలోకి తీసుకొని జీతం పెంపు ఉంటుంది. ఇది కాకుండా, డీఏ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందుతుంది. డీఏ బకాయిల కోసం 18 నెలల నిరీక్షణ ముగిసింది. ఒకేసారి రూ.2 లక్షల వరకు డీఏ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది