7th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. 4 శాతం పెరిగిన డీఏ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

7th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. 4 శాతం పెరిగిన డీఏ

 Authored By sandeep | The Telugu News | Updated on :4 August 2022,6:00 pm

7th Pay Commission : గ‌త కొద్ది రోజులుగా డీఏ పెంపు నిర్ణ‌యంపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఎంత పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు అనే దానిపై అస్స‌లు క్లారిటీ లేకుండా పోయింది. నెలల తరబడి విశ్లేషణలు, ఊహాగానాల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు నిర్ణయం జరిగింది. తాజా పెంపుతో డీఏ 38 శాతానికి చేరుకుంది. డీఎన్‌ఏ అనుబంధ సంస్థ జీ బిజినెస్ తాజా నివేదిక ప్రకారం 4 శాతం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోబడిందని స‌మాచారం. దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది.

కొత్త డీఏ లెక్కల ప్రకారం పెరిగిన చెల్లింపులు వచ్చే నెలలో ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి జ‌మ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల‌న 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన ఉద్యోగుల కరువు భత్యం (డీఏ), పింఛనుదారుల కరువు ఉపశమనం (డీఆర్‌)ను కూడా పెంచిన‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేట్లకు అనుగుణంగా డీఏ, డీఆర్‌ను 4 శాతం వరకు పెంచిన‌ట్టు తెలుస్తుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫారసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నది.

7th Pay Commission on da hiked by 4 percent

7th Pay Commission on da hiked by 4 percent

7th Pay Commission : పెరిగిన డీఏ

ఉద్యోగులకు డీఏను ప్రభుత్వం ఏడాదికి రెండు విడుతల్లో చెల్లిస్తున్నది. డీఏను 4 శాతం పెంచాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. దీనికి గత మార్చిలో క్యాబినెట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. అయితే కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఈ నేపథ్యంలో డీఏ పెంపు నిర్ణయాన్ని కేంద్రం తాత్కాలికంగా పక్కనబెట్టింది. డీఏను నిర్ణయించడంలో ఏఐసీపీఐ ఇండెక్స్ అత్యంత కీలకం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచడానికి ముందే.. త్రిపుర కేబినెట్ తన రాష్ట్రానికి చెందిన ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్ చెప్పేసింది. డియర్‌నెస్ అలవెన్స్‌ను 5 శాతం పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు తెలిపింది

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది