7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్రిబుల్ ధమాకా.. భారీగా పెరగనున్న జీతం..!!
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని డీఏ పెంపు కోసం, డీఏ బకాయిల చెల్లింపుల కోసం, అలాగే ఫిట్ మెంట్ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూడింటి కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్రిబుల్ ధమాకా ఇచ్చేందుకు కేంద్రం కూడా రెడీ అవుతోంది. అందులో ఒకటి డీఏ పెంపు, రెండోది డీఏ బకాయిల చెల్లింపు,
మూడోది ఫిట్ మెంట్ ఫ్యాక్టర్. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి రెండు సార్లు డీఏ పెరగాలి. గత సంవత్సరం సెప్టెంబర్ లో డీఏ పెరిగింది. మళ్లీ జనవరిలో పెరగాలి. ఇప్పటి వరకు పెరగలేదు. దీంతో డీఏ పెంచాలంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అయితే.. డీఏపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు డీఏ 4 శాతం పెరగనుందట. అంటే.. ప్రస్తుతం ఉన్న డీఏ 38 శాతం మాత్రమే. అది 42 శాతం కానుంది. 38 నుంచి 42 శాతం పెరగనుంది.
7th Pay Commission : 4 శాతం పెరగనున్న డీఏ
దీంతో డీఏ, డీఆర్ 42 శాతం కానుంది. పెరిగే డీఏ, డీఆర్ వల్ల 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68 లక్షల పెన్షనర్లకు లాభం చేకూరనుంది. మరోవైపు కరోనా వల్ల రాకుండా ఆగిపోయిన 18 నెలల డీఏ బకాయిలపై కూడా కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ విషయంలోనూ కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందట. ఇంకొన్ని రోజుల్లో హోలీ ఉన్న నేపథ్యంలో హోలీ పండుగ నాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. 2.57 గా ఉన్న ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను 3.68 గా చేసే అవకాశం ఉంది.