7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అమలులోకి సెవెన్త్ పే కమిషన్.. జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం త్వరలోనే రాబోతోంది. సెవెన్త్ పే కమిషన్ ను అమలు చేయడానికి కేంద్ర సర్కార్ సన్నాహాలు చేస్తోంది. దీని వల్ల.. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఫిట్ మెంట్ పెరగనుంది. ఫిట్ మెంట్ పెరిగితే.. కనీస వేతనంతో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి. ఫిట్ మెంట్ ను 2.57 నుంచి 3.68 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెంచాలని కూడా యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 2.57 శాతం ఫిట్ మెంట్ ప్రకారం.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి. ఒకవేళ 3.68 శాతానికి ఫిట్ మెంట్ ను పెంచితే.. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీతం కనీసం రూ.8000 పెరుగుతుంది. అంటే.. కనీస వేతనం కూడా 18 వేల నుంచి 26 వరకు పెరగనుంది.ఒకవేళ బేసిక్ పేను ప్రభుత్వం పెంచితే.. దానితో పాటు డీఏ కూడా పెరగనుంది.
7th Pay Commission : బేసిక్ పే తో పాటు పెరగనున్న డీఏ
ప్రస్తుతం బేసిక్ పే నుంచి 31 శాతాన్ని డీఏగా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఒకవేళ బేసిక్ పే పెరిగితే.. ఆటోమెటిక్ గా డీఏ కూడా పెరుగుతుంది. అలాగే.. డీఏ అరేర్స్ పై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ.. డీఏ అరేర్స్ పై సానుకూల నిర్ణయం తీసుకుంటే.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కనీసం రెండు లక్షల రూపాయల వరకు డీఏ అరేర్స్ అకౌంట్ లో పడనున్నాయి.