Home » Exclusive » 80 Percent Discount On These Products In Flipkart Bumper Sale
Exclusive

Flipkart Sale : ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్, ఈ వస్తువులపై 80 శాతం భారీ తగ్గింపు.. వెంటనే కొనేయండి

Authored By
aruna
The Telugu News | Published on: August 8, 2022, 9:00 pm
Advertisement

Flipkart Sale : ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ మరో బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది. బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు సేల్ ను నిర్వహిస్తోంది. ఈ సేల్ లో భాగంగా 5 రోజుల్లో పలు రకాల వస్తువులపై భారీ తగ్గింపును అందిస్తోంది. కొన్ని వస్తువులపై సుమారు 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. భారీ ఆఫర్లతో పాటు స్పెషల్ డిస్కౌంట్లను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. అలాగే.. ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా పలు వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే ఆగస్టు 3, 4 తేదీలలో ఫ్లిప్ కార్ట్.. షాప్ ఎట్ సేల్ ప్రైస్ బిఫోర్ సేల్ ను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Flipkart Sale : మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో భాగంగా యాపిల్, నథింగ్, మోటరోలా, వివో, ఒప్పో లాంటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ పై భారీ డిస్కౌంట్లను, బెస్ట్ డీల్స్ ను అందిస్తోంది. మొబైల్ ఫోన్స్ తో పాటు ల్యాప్ టాప్ లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, కంప్యూటర్ యాక్సెసరీస్ మీద 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఎయిర్ కండిషనర్స్, టీవీలు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మెషిన్లు లాంటి వాటిపై 75 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే బ్యూటీ ప్రాడక్ట్స్ పై కూడా పలు ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.

80 percent discount on these products in flipkart bumper sale

Advertisement

బిగ్ సేవింగ్ డేస్ సేల్ తో పాటు రష్ అవర్ సేల్ ను ఫ్లిప్ కార్ట్ ప్రారంభించింది. ఈ రష్ అవర్ సేల్ లో భాగంగా బెస్ట్ డీల్స్ ను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఉదయం 8, మధ్యాహ్నం 12, సాయంత్రం 4 గంటలకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. మరోవైపు ఫ్లిప్ కార్ట్ తో పాటు అమెజాన్ కూడా ఆగస్టు 6 నుంచి 10 వరకు గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈ సేల్ లోనూ అమెజాన్ భారీ ఆఫర్స్ ను అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి