8th Pay Commission : కేంద్ర బడ్జెట్ లో 8వ వేతన సంఘం.. జీతాల పెరుగులపై ఉద్యోగుల ఆశలు..!
ప్రధానాంశాలు:
8th Pay Commission : కేంద్ర బడ్జెట్ లో 8వ వేతన సంఘం.. జీతాల పెరుగులపై ఉద్యోగుల ఆశలు..!
8th Pay Commission : ఈమధ్యనే ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం డీఏను 4 శాం పెంచిన కేంద్ర ప్రభుత్వం దాని కాల పరిమిత ముగియడంతో 8వ వేతన కమీషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రాబోయే వార్షిక బడ్జెట్ లో దీనికి సంబందించిన 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేస్తారని అంటున్నారు. 2024-25 వార్షిక బడ్జెట్ లో 8వ పే కమీషన్ ని ఏర్పాటు చేస్తే ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు లాభం చేకూరే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటైతే ఉద్యోగులకు సంబందించిన కీలక నిర్ణయాలు ముఖ్యంగా వారి జీతాలు మిగతా అలవెన్స్ ల గురించి నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ద్రవ్యోల్భణం ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. ఐతే అందుతున్న నివేదికల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు కేంద్రం వారికి వచ్చే జాతీలు పెంచుతుందని నమ్ముతున్నారు.
8th Pay Commission ఉద్యోగుల బకాయిలు చెల్లింపులు కూడా..
రాబోయే బడ్జెట్ లో 8వ పే కమీషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలకు ప్రభుత్వం పాజిటివ్ గానే స్పందిచింది. బేసిక్ పే, ఆవెన్స్, పెన్ష ఇలా అన్ని బెనిఫిట్స్ సవరించే ఏర్పాటు చేస్తున్నారట. దీని గురించి ఇటీవలే కేబినెట్ సెక్రెటరీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సెక్రెటరీ జనరల్ ఎస్.బీ యాదవ్ లేఖ రాశారు. 8వ వేతన సంఘం ద్వారా పాత పెన్షన్ విభాగాన్ని పునరుద్ధరించాలని.. కరోనా టైం లో 18 నెలల డీఏ బకాయిలు కూడా రిలీజ్ చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
సెంట్రల్ పే కమీషన్ ను 10 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీత భత్యాలు, బెనిఫిట్స్ ను సమీషించి అవసరమైన సవరణలు చేస్తుంటారు. 2014 లో అప్పటి మన్మోహన్ సింగ్ 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి అమలు పరిచారు. 10 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నాఉ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.