
Diamond : నిరుపేద కుర్రాళ్లకు వందల కోట్ల విలువ చేసే వజ్రం దొరికింది... ఇక ఈ వజ్రంతో ఆ నిరుపేదల జీవితాలు మారాయా.?
Diamond :ఇద్దరు నిరుపేద కుర్రాళ్లకు నీళ్లలో ఒక పెద్ద ముడి వజ్రం దొరికింది. ప్లీ డైమండ్ గా పిలిచే ఆ వజ్రం 709 క్యారెట్లు ఉంది. ప్రపంచంలోనే అది 14వ అతిపెద్ద వజ్రమని రికార్డుల్లోకి ఎక్కింది. దాని విలువ కోట్ల రూపాయలు ఉంటుంది. వజ్రం దొరకడంతో తమ జీవితాలు మారిపోతాయని ఆ అబ్బాయిలు అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది.? 2017 లో ఆఫ్రికాలోని చీర ఆలయంలో ఈ ఘటన జరిగింది. పంబా జన్బుల్, ఆండ్రూ సఫియా సహా ఐదుగురు సభ్యుల బృందం వజ్రాల కోసం వెతుకుతుంది. అదే ఏడాది మార్చి 13న నీటి ప్రవాహం అడుగున మెరుస్తూ కనిపించిన పెద్ద వజ్రం. ఎప్పుడు వజ్రాన్ని చూడలేదని మెరుస్తున్న ఆ పెద్ద రాయిని చూసి అదే వజ్రం అయి ఉంటుందేమో అనుకున్నానని జాన్ బుల్ చెప్పారు.
ఆ రాయిని పట్టుకున్నప్పుడు అది చాలా చల్లగా ఉంది అన్నారు. పేదరికంలో ఉన్న ఆండ్రూ సఫియా పొట్టకూటి కోసం వజ్రాల అన్వేషణ బృందంలో చేరారు. ఆ బృందానికి స్థానిక పాస్టర్ గా ఉన్నారు. ఈ పని చేసినందుకు వీళ్ళకు జీతం ఇవ్వరు. కానీ రోజు తిండి పెడతారు. వజ్రం దొరికిన తరువాత ఆ విషయాన్ని వాళ్ళు స్థానిక పాస్టర్ ఇమ్మాన్యులకు చెప్పారు. ఆయన వజ్రాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి అప్పగించిన ఆ వజ్రాన్ని వేలం వేశారు. వేలంలో ఆ వజ్రం 6.5 మిలియన్ డాలర్ల అమ్ముడైంది. అంటే భారత కరెన్సీ లో దాదాపు 84 కోట్ల రూపాయలు.. పేదరికంలో మగ్గిపోతున్న స్థానికుల జీవితాల్లో ఈ వజ్రంతో మార్పు వస్తుందని వార్త కథనాలు పేర్కొన్నాయి. బృందానికి లభించే డబ్బును సభ్యులందరికీ సమానంగా పంచాలని నిర్ణయించారు. తొలి విడతలో ఒక్కొక్కరికి 80 వేల డాలర్లు ఉంటాయి. అంటే భారత కరెన్సీలో 66 లక్షలకు పైగా ఉంటుంది.
అంత డబ్బును చూస్తామని తన వాటా డబ్బు దొరికినప్పుడు దానిని ముట్టుకోకుండా కొన్ని రోజులపాటు అలానే చూస్తూ ఉండిపోయానని మురిసిపోయానని జాన్బులు చెప్పారు. ఇక తర్వాత జాన్బులు సభ్య కెనడాకు వెళ్లి అక్కడ ఆరు నెలలు ఉండి చాలా డబ్బు ఖర్చు చేశారు. తర్వాత సఫియా కు విసా రాలేదు.ఇక అక్కడే కొత్త జీవితం మొదలుపెట్టారు. జాన్ బుల్ ఉదయం డ్రైవర్ గా పని చేస్తూ సాయంత్రం చదువుకున్నారు. రాత్రిపూట గుర్రాలను సంరక్షించే పని చేస్తుంటానని అక్కడే తిని వాటి మధ్యనే పడుకుంటానని సఫియా అన్నారు. వజ్రం దొరికిన తరువాత ఊహించిన విధంగా జీవితం మారలేదు అన్నారు జాన్ బుల్ ఉండటానికి కూడా సరైన వసతి లేని దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నానని చెప్పారు. ల జాన్ బుల్ వజ్రం దొరికిన తర్వాత తనకు రావాల్సినంత పేరు రాలేదన్నారు. వజ్రం దొరికింది వాళ్ళకేనా పాస్టర్ ఇమాన్యుల్ కే బాగా పేరు వచ్చింది అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్…
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
This website uses cookies.