Kurnool : టమాట తోటలో పనికి వెళ్లిన మహిళ.. లక్షాధికారి అయింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kurnool : టమాట తోటలో పనికి వెళ్లిన మహిళ.. లక్షాధికారి అయింది..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 June 2021,12:30 pm

Kurnool : ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు? అంటూ మన పెద్దలే చాలా సార్లు చెప్పారు. అవును.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఈ క్షణం వరకు పేదోడిగా ఉన్న వ్యక్తి.. మరుక్షణంలో కోటీశ్వరుడు అవుతున్నాడు. అంతా కాలం నిర్ణయిస్తుంది. ఎప్పుడు ఎవరు ఏం అవుతారో? ఓ మహిళ కూడా అంతే. తను ఏనాడు కూడా లక్షాధికారి అవుతానని కలలో కూడా ఊహించలేదు. అసలు.. రోజూ మూడు పూటల భోజనం దొరికితే చాలు.. అని అనుకున్న ఆ మహిళ.. ఒక్క రోజులోనే లక్షాధికారి అయింది.

woman found diamond in kurnool

woman found diamond in kurnool

ఎలగెలగా అంటారా? ఓ మహిళ.. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఓ రోజు టమాట తోటలో కూలి పనికి వెళ్లింది. అక్కడే ఆమెకు అదృష్టం వరిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆరోజు ఆమె లక్షాధికారి అవుతుందని కూడా ఎవ్వరూ అనుకోలేదు. టమాటాలు ఏరుతుండగా.. ఆమెకు తోటలో రంగురంగులతో మెరిసిపోతున్న ఓ రాయి దొరికింది. ఇదేంటి.. ఇలా మెరిసిపోతోందని.. ఆ మహిళ.. అక్కడ ఉండే బంగారం వ్యాపారికి చూపించింది. దీంతో దాన్ని టెస్ట్ చేసిన వ్యాపారి.. అది వజ్రం అని తేల్చాడు.

Kurnool : లక్షల విలువ చేసే వజ్రం అది

అది నాలుగున్నర క్యారెట్లు ఉన్న వజ్రం అట. అదే గ్రామానికి చెందిన మరో వ్యాపారి.. ఆ మహిళ దగ్గర ఉన్న వజ్రాన్ని తీసుకొని.. 6.5 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు.. 2 తులాల బంగారం కూడా ఇచ్చాడట. దీంతో ఆ మహిళ ఒక్కరోజులోనే లక్షాధికారి అయిపోయింది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కర్నూలు జిల్లాలోని తుగ్గలి ప్రాంతంలో వజ్రాలు ఇదివరకు కూడా చాలామందికి దొరికాయి. ఇటీవల కూడా ఓ రైతుకు వజ్రం దొరికింది. తన పొలంలోనే వజ్రం దొరకగా.. దాన్ని అమ్మితే.. కోటి రూపాయలు వచ్చాయి. ఇలా… చాలాసార్లు ఆ ప్రాంతంలో చాలామందికి వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. ఇప్పటికీ.. కొందరు వజ్రాల కోసం వెతుకుతూనే ఉంటారు. కానీ.. అవి అదృష్టం ఉన్నవాళ్లకే దొరుకుతుంటాయి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది